జాతీయ వార్తలు

గ్యాంగ్‌రేప్ కేసులో వెంటనే నివేదిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలహాబాద్, ఆగస్టు 10: ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో జరిగిన సామూహిక అత్యాచారం కేసుపై గురువారం నాటికి నివేదిక అందించాలని అలహాబాద్ హైకోర్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. చీఫ్ జస్టిస్ డిబి భోసలే, జస్టిస్ యశ్వంత్ వర్మలతో కూడిన ధర్మాసనం తల్లీ, కూతుళ్లపై జరిగిన గ్యాంగ్‌రేప్ కేసును సమోటోగా స్వీకరించింది. బుధవారం కేసు దర్యాప్తు వివరాలు తమకు అందించాలని తొలుత బెంచ్ ఆదేశించింది. అయితే ప్రభుత్వం నివేదిక అందించడంలో విఫలమైంది. నివేదిక అందజేయడానికి గడువుకావాలని అడ్వొకేట్ జనరల్ విజయ్ బహదూర్ సింగ్ అభ్యర్థనపై ధర్మాసనం స్పందించింది. ‘గురువారం మధ్యాహ్నం 2 గంటల లోపు నివేదికను సీల్డ్‌కవర్‌లో కోర్టుకు అందజేయాలి’ అని ఆదేశించారు. గత నెల 29న బులంద్‌షహర్‌లో ఈ ఘోరం జరిగింది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన సమాజ్‌వాదీ ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పడేసింది.

రాష్ట్రంలో శాంతిభద్రతలు కరవయ్యాయంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.

తాత్కాలిక ఉద్యోగుల
క్రమబద్ధీకరణ!
కేంద్ర మంత్రి హామీ

న్యూఢిల్లీ, ఆగష్టు 10: జాతీయ బ్యాంకులు, తెలంగాణ గ్రామీణ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ వికాస్ గ్రామీణ్ బ్యాంకులలో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగుల క్రమబద్ధీకరణకు కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు ఆల్ ఇండియా ఓబిసి బ్యాంక్స్ ఎంప్లారుూస్ జాతీయ కన్వీనర్ కస్తూరి జయప్రసాద్ చెప్పారు. బుధవారం ఎంపీ దేవేందర్ గౌడ్ ఆధ్యర్యంలో ప్రతినిధి బృందం కేంద్ర మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్‌ను కలిశారు. తాత్కాలిక ఉద్యోగులు సమస్యలు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనికి మంత్రి సానుకులంగా స్పందిచారని, న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని కస్తూరి జయప్రసాద్ చెప్పారు.

రిషికేష్‌లో జగన్
స్వరూపానందేంద్ర
ఆశ్రమంలో పూజలు

న్యూఢిల్లీ, ఆగస్టు 10: ఏపీ ప్రతిపక్ష నేత, వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి నిర్వహిస్తున్న చాతుర్మాస దీక్షలో భాగంగా బుధవారం జరిగిన హోమం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉత్తరాఖండ్‌లోని రుషికేష్‌లో ఆషాడ శుద్ధ పౌర్ణమి రోజున చాతుర్మాస దీక్షా మహోత్సవం ప్రారంభమైంది. బుధవారం ఉదయం రిషికేష్ చేరుకొన్న జగన్ గంగానదిలో పుణ్యస్నానం ఆచరించారు. గంగానదీకి హారతి ఇచ్చి వస్త్రాలు సమర్పించారు. అనంతరం స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారి ఆశీస్సులు తీసుకుని, ఆశ్రమంలో జరుగుతున్న చాతుర్మాస దీక్షాహోమం, పూజాదికాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ ప్రత్యేకహోదాకోసం జగన్ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి రావడం శుభపరిణమం అన్నారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోరుకోవడం గొప్ప విషయమని అన్నారు. జగన్‌తోపాటు ఆ పార్టీ ఏంపీలు విజయ సాయి రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి, సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.