జాతీయ వార్తలు

జెఎన్‌ఐఎంఎస్ వైద్యుల పర్యవేక్షణలో షర్మిలకు పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంఫాల్, ఆగస్టు 10: పదహారేళ్లగా కొనసాగిస్తున్న దీక్ష విరమించిన మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిలకు జవహర్‌లాల్ నెహ్రూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనె్సస్ (జెఎన్‌ఐఎంఎస్) నిపుణుల పర్యవేక్షణలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. సుదీర్ఘకాలంపాటు నాసికద్వార ద్రవరూపంలోనే ఆహారం తీసుకున్న షర్మిల ఇప్పటికిప్పుడు ఘన ఆహారం ఇవ్వడం కుదరదు. దీక్ష విరమించినప్పటికి ఆమెను ఆసుపత్రిలోనే జెఎన్‌ఐఎంఎస్ వైద్యుల పర్యవేక్షణలో ఉంచి సేవలు అందిస్తారు. షర్మిల శారీరకంగా కాస్త బలపడ్డ తరువాత ఘన ఆహారం తీసుకోవడానికి అనువైన పరిస్థితులు ఏర్పడిన తరువాతే బయటకు పంపిస్తారు. మరోపక్క దీక్ష విరమణను వ్యతిరేకించే కొన్ని సంస్థల నుంచి షర్మిల ప్రాణాలకు ముప్పు ఉన్నందున ఆసుపత్రి ప్రాంగణంలోనే సాయుధ పోలీసుల భద్రత కల్పించినట్టు అధికారులు వెల్లడించారు. సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం రద్దు చేయాలంటూ షర్మిల 16 ఏళ్లపాటు దీక్ష చేశారు. ఆత్మహత్యాయత్నం కేసు పెట్టి ప్రభుత్వ ఆసుపత్రి వెలుపలే ఓ గదిలో ఉంచి ఆమెకు ద్రవరూపంలో ఆహారం అందించేవారు. 44 ఏళ్ల షర్మిల దీక్షలు పోలీసులు అనేకసార్లు భగ్నం చేయడం, ఆమె మళ్లీ కొనసాగించడం జరిగింది. దీని కోసం ఏకంగా ఆసుపత్రిలోని ఓ గది జైలుగా మారిపోయింది. దీక్ష విరమించిన షర్మిల ఎన్నికల్లో పాల్గొంటానని ప్రకటించారు. తాను ముఖ్యమంత్రిని అయితే సాయుధ ఎఎఫ్‌ఎస్‌పిఏ రద్దుచేస్తానని చెప్పారు. ఇన్నాళ్లూ ఆత్మహత్యాయత్నం కేసును ఎదుర్కొన్న షర్మిలకు ఇంఫాల్ వెస్ట్ జిల్లా ముఖ్య జుడీషియల్ మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు. వ్యక్తిగత పూచీకత్తు కింద పదివేలు చెల్లించిన తరువాత విడుదలకు కోర్టు విడుదల ఆదేశాలు ఇచ్చింది. షర్మిల ఈ నెల 23న కోర్టుకు హాజరుకావాల్సి ఉంది.