జాతీయ వార్తలు

కాశ్మీర్ అల్లర్లలో లష్కరే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 10: జమ్మూ, కాశ్మీర్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న అశాంతికి నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ఆజ్యం పోస్తోందని జాతీయ భద్రతా ఏజన్సీ (ఎన్‌ఐఏ) ఆరోపించింది. కాశ్మీర్‌లోయలో గత 33 రోజులుగా కొనసాగుతున్న హింసాకాండలో లష్కరే తోయిబా పాత్రకు సంబంధించి మరిన్ని ఆధారాలను సేకరిస్తున్నామని కూడా ఏజన్సీ తెలిపింది. జమ్మూ, కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా నౌగామ్ సెక్టార్‌లో గత నెల 25న పట్టుబడిన లష్కరే తోయిబా ఉగ్రవాది బహదూర్ అలీని ఎన్‌ఐఏ బుధవారం మీడియా ముందు ప్రవేశపెట్టింది. బహదూర్ అలీని ప్రశ్నించినప్పుడు కాశ్మీర్ అల్లర్లను రాజేయడంలో లష్కరే తోయిబా పాత్ర ఉన్నట్లు తెలిసిందని ఎన్‌ఐఏ తెలిపింది. కాశ్మీర్ అల్లర్లలో లష్కర్ పాత్రపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తుందని ఎన్‌ఐఏ ఇన్‌స్పెక్టర్ జనరల్ సంజీవ్ సింగ్ చెప్పారు. పంజాబీ భాష మాట్లాడే అలీ అలియాస్ సఫియుల్లా తన కుటుంబం గురించి, లష్కరే శిక్షణా శిబిరంలో గడిపిన రోజులు, భారత భూభాగంలోకి చొరబడడం గురించి మాట్లాడిన వీడియోను ఎన్‌ఐఏ మీడియాకు చూపించింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో లష్కరే తోయిబా 30-50 మందితో క్యాంపులు నిర్వహిస్తూ, వారికి తీవ్రవాదులుగా శిక్షణ ఇస్తున్నట్లు బహదూర్ అలీ అధికారులకు చెప్పాడు. కాశ్మీర్‌లో ప్రస్తుతం నెలకొన్న అశాంతిని తనకు అనుకూలంగా మలచుకోవడానికి ఆ సంస్థ ప్రయత్నించిందని, అందులో భాగంగానే అలీ వంటివారిని కాశ్మీర్‌లోకి పంపించిదని ఎన్‌ఐఏ ఆరోపించింది. బుర్హాన్ వనీ హత్య తర్వాత కాశ్మీర్ లోయలో చెలరేగిన హింస గురించి పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని కంట్రోల్ రూమ్‌నుంచి లష్కరే తోయిబా మిలిటెంట్లు తనకు తెలియజేసి ఆందోళనకారులతో కలిసిపోయి భద్రతా దళాలపై గ్రెనేడ్లు విసరాలని ఆదేశించినట్లు అలీ ఎన్‌ఐఏ అధికారులకు చెప్పాడు. పట్టుబడిన మిలిటెంట్‌కు సంబంధించిన ఒక వీడియోను ఎన్‌ఐఏ మీడియాకు చూపించడం ఇదే మొదటిసారి.