జాతీయ వార్తలు

ఆ 21 మంది విద్యార్థులూ దోషులే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 23: గత ఫిబ్రవరి 9న ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీలో జరిగిన ఓ వివాదాస్పద కార్యక్రమంలో పాల్గొన్నందుకు వివిధ రకాల శిక్షలను ఎదుర్కొన్న 21 మంది విద్యార్థులు తప్పు చేశారని అపెలేట్ అథారిటీ అభిప్రాయపడింది. అయితే వీరిలో కొంతమందిపై విధించిన ఆర్థికపరమైన జరిమానాలను ఆ అథారిటీ తగ్గించింది. ‘్ఫబ్రవరి 9నాటి వివాదాస్పద సంఘటనతో సంబంధం కలిగిన 21 మంది విద్యార్థులు తప్పు చేశారని కమిటీ అభిప్రాయపడింది. వారికి విధించిన శిక్షలు ఇప్పటికీ అలాగే కొనసాగుతాయి. అయితే కొందరిపై విధించిన జరిమానాలను తగ్గించడమైంది. ఈ నిర్ణయాలను విద్యార్థులకు తెలియజేస్తూ తాజాగా లేఖలు పంపిస్తున్నాం’ అని యూనివర్శిటీ అధికారి ఒకరు చెప్పారు. అత్యున్నత స్థాయి దర్యాప్తు కమిటీ సిఫార్సులు, దరిమిలా అపెలేట్ అథారిటీకి సాయపడడానికి ఏర్పాటు చేసిన కమిటీ చేసిన సిపార్సుల నేపథ్యంలో విద్యార్థులు చేసిన అపీళ్లపై వైస్ చాన్సలర్ ఒక అభిప్రాయానికి వచ్చి తుది నిర్ణయం తీసుకున్నట్లు యూనివర్శిటీ సోమవారం తెలిపింది. పార్లమెంటుపై దాడి కేసులో మరణశిక్ష పడిన అఫ్జల్ గురును ఉరి తీయడాన్ని వ్యతిరేకిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 9న జెఎన్‌యులో జరిగిన ఒక కార్యక్రమంలో దేశ వ్యతిరేక నినాదాలు చేయడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. విద్యార్థి నాయకుడు కన్హయ కుమార్ సహా ముగ్గురు విద్యార్థులను దేశ ద్రోహం నేరం కింద అరెస్టు చేయగా, ప్రస్తుతం వారు బెయిలుపై ఉన్నారు. క్రమశిక్షణ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఉన్నతస్థాయి దర్యాప్తు కమిటీ సిఫార్సుల మేరకు మరో 21 మంది విద్యార్థులపై యూనివర్శిటీనుంచి పంపించి వేయడం, హాస్టళ్లనుంచి డీబార్ చేయడం, గనదు జరిమానాలు విధించడం లాంటి రకరకాల శిక్షలను విధించడం జరిగింది. దీనిపై విద్యార్థులు 16 రోజుల పాటు నిరవధిక నిరాహార దీక్షలు చేసినప్పటికీ యూవర్శిటీ అధికారులు దిగిరాకపోవడంతో కొంతమంది హైకోర్టుకు వెళ్లారు.
దీనిపై కోర్టు తక్షణం దీక్షలను విరమించాలని, కొత్తగా ఎలాంటి ఆందోళనలు చేపట్టరాదని విద్యార్థి సంఘాన్ని ఆదేశించడంతో పాటుగా విద్యార్థుల అపీళ్లపై అపెలేట్ అథారిటీ తీర్పు వెలువడే వరకు వారిపై చర్యలను నిలిపివేసింది.