జాతీయ వార్తలు

ఇన్‌ఫ్రా విస్తరణతోనే అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 23: ప్రాథమిక వౌలిక రంగ అభివృద్ధి జరగకుండా భారత్ అభివృద్ధి సాధ్యం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కీలకమైన ఇన్‌ఫ్రా రంగాలలో అభివృద్ధిని వేగంగా సాధించేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు. సంప్రదాయేతర ఇంధన వనరులు, రైల్వేలు వంటి కీలకరంగాల్లో పురోగతికి సంబంధించిన అంశాలపై ప్రధానమంత్రి సోమవారం సమీక్ష నిర్వహించారు. ‘‘ఆగస్టు 22, 2016న కీలకమైన వౌలిక రంగాల్లో పురోగతిపై సమీక్షా సమావేశానికి నేతృత్వం వహించాను. వివిధ రంగాలకు సంబంధించి తరచూ నేను సమీక్షిస్తున్నాను. మన ప్రధానమైన వౌలికరంగంలో పురోగతి సాధించకుండా దేశాభివృద్ధి సాధ్యమే కాదు’’ అని మోదీ ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు. ‘‘మన అభివృద్ధి పథం ప్రత్యేకమైంది. సుస్థిరంగా క్రమబద్ధమైన వేగంతో చర్యలు చేపడితే దేశం చారిత్రక అభివృద్ధి సాధిస్తుంది’’ అని అన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగించిన సమయంలో భారత్ ఒక్కటే ఆశాదీపంగా కనిపిస్తోందని మోదీ పేర్కొన్నారు. వరుసగా రెండేళ్లు కరవు తాండవించినా, వ్యవసాయోత్పత్తి మాత్రం తగ్గనే లేదని తెలిపారు. మార్కెట్‌ను విస్తరించటం, రైతుల ఉత్పత్తులకు ఎక్కువ ఆర్థిక లాభం కలిగించటం వంటి చర్యలవల్ల వారి వ్యవసాయం కొనసాగేట్లు చేశామని, ఈ విధమైన పురోగతిని స్థిరంగా కొనసాగించటం ద్వారా భారత్‌ను ఆర్థిక శక్తిగా రూపాంతరం చెందించగలమని ఆయన పేర్కొన్నారు. ఇంధన రంగంలో వేగంగా అభివృద్ధి సాధిస్తున్నామని, ఇప్పటివరకు 44గిగావాట్లకు విద్యుదుత్పత్తి పెరిగిందన్నారు. కేంద్ర, రాష్ట్రాల విధానాల పరిధిలో లక్ష్యాలను సాధించామని మోదీ తెలిపారు. సౌర విద్యుత్ రంగానికి సంబంధించి రూఫ్‌టాప్ జనరేషన్‌లో గణనీయంగా పురోగతి కనిపిస్తోందని మోదీ వివరించారు. విమానయాన రంగంలోనూ అదేవిధంగా ముందుకు వెళ్తున్నామని వివరించారు. విమానాశ్రయాల్లో రక్షణ, కనెక్టివిటీ వంటి అంశాలకు ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. 8 విమానాశ్రయాలు ప్రపంచస్థాయి అయిదు కేటగిరీలలో ర్యాంకులు సాధించాయని ప్రధాని వివరించారు. రైల్వేలకు సంబంధించి ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో 40 కాపలా లేని క్రాసింగ్‌లను తొలగించామన్నారు. దేశవ్యాప్తంగా తీరప్రాంత వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి విస్తృతంగా కృషి చేస్తున్నామని మోదీ పేర్కొన్నారు. హౌసింగ్ రంగానికి సంబంధించి వివరిస్తూ ఈ ఆర్థిక సంవత్సరంలో 6.94లక్షల గ్రామీణ ఇళ్లు పూర్తి చేసినట్లు మోదీ పేర్కొన్నారు.

జాతీయవాదమే
బిజెపి వేదం
దేశవ్యాప్తంగా తిరంగ ప్రభావం బిజెపి కోర్ భేటీలో మోదీ ఉద్ఘాటన
న్యూఢిల్లీ, ఆగస్టు 23:దేశ సమైక్యత, సమగ్రత, సామరస్య స్పూర్తిని తిరంగ యాత్ర చాటి చెప్పిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 70వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దేశ వ్యాప్తంగా వారం పాటు నిర్వహించిన ఈ యాత్ర సత్ఫలితాలనిచ్చిందని చెప్పారు.బిజెపి రాష్ట్ర విభాగాల నేతల్ని ఉద్దేశించి మాట్లాడిన మోదీ జాతీయవాదానికి తమ పార్టీ ప్రతిరూపమన్నారు. సమైక్యత, సమగ్రత, సామారస్య వాతావరణాన్ని దెబ్బతీసే శక్తులు రెచ్చిపోతున్న తరుణంలో బిజెపి నేతలు, మంత్రులు వారం పాటు నిర్వహించిన తిరంగ యాత్ర ప్రజల్లో జాతీయవాద స్ఫూర్తిని బలోపేతం చేసిందన్నారు. కాశ్మీర్ అశాంతి, అమ్నెస్టీ వ్యవహారం, జెఎన్‌యు వివాదాలను మోదీ నేరుగా ప్రస్తావించక పోయినా జాతీయభావాన్ని పరిరక్షించేందుకు బిజెపి త్రికరణ శుద్ధిగా పనిచేస్తుందన్న విషయాన్ని ఉద్ఘాటించారు. దేశాభివృద్ధి కోసం తమ పార్టీ నిరంతరం చేస్తున్న ప్రయత్నాలు కొన్ని శక్తులకు గిట్టడం లేదని, ప్రజల దృష్టిని మళ్లించడమే ధ్యేయంగా పెట్టుకున్నాయన్నారు.సమాజంలోని అన్ని వర్గాలతో మమేకపై వారితో కలిసి పనిచేయాలని బిజెపి శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. బిజెపి సిద్ధాంత కర్త దీన దయాళ్ ఉపాధ్యాయ శతజయంతి ఉత్సవాలు గురువారం నుంచి ప్రారంభం అవుతున్నందున ఆయన లక్ష్యమైన అంత్యోదయాన్ని సాధించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు బిజెపి శ్రేణులు ఎంత నిర్మాణాత్మకంగా పనిచేశాయో ఇప్పుడు అధికార పక్షంగా అంతకు మించిన నిర్మాణాత్మక దృక్పథంతో ముందుక వెళ్లాలని మోదీ పిలుపునిచ్చినట్టు కేంద్ర మంత్రి అనంత్ కుమార్ వెల్లడించారు.