జాతీయ వార్తలు

లీకైన ‘స్కార్పీన్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/మెల్‌బోర్న్, ఆగస్టు 24: భారత నౌకా దళం కోసం ఫ్రాన్స్ కంపెనీ నిర్మిస్తున్న ఆరు అత్యాధునిక స్కార్పీన్ జలాంతర్గాములకు సంబంధించిన 22వేల పేజీల సాంకేతిక రహస్య వివరాలు బహిర్గతమయ్యాయి. ఈ పరిణామం భద్రతా విభాగాల్లో తీవ్ర ప్రకంపనలు పుట్టిస్తోంది. జలాంతర్గాములకు సంబంధించిన సాంకేతిక, సామర్థ్య వివరాలు ఎలా లీకు అయ్యాయన్న దానిపై నౌకాదళం బుధవారం దర్యాప్తునకు ఆదేశించింది. 3.5బిలియన్ డాలర్ల వ్యయంతో ఫ్రాన్స్ నౌకా సంస్థ డిసిఎన్‌ఎస్ సహకారంతో ముంబయిలో ఆరు స్కార్పీన్ ఆధునిక జలాంతర్గాములు నిర్మితమవుతున్నాయి. ఆస్ట్రేలియా పత్రిక ‘ది ఆస్ట్రేలియన్’ ఈ రహస్య వివరాలను తన వెబ్‌సైట్‌లో ప్రచురించడంతో కలవరం మొదలైంది. ఈ పరిణామంపై రక్షణ మంత్రి మనోహర్ పారికర్ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఈ విషయం తెలుసుకున్న ఆయన మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని నౌకాదళ ప్రధానాధికారి అడ్మిరల్ సునీల్ లాంబాను ఆదేశించారు. అలాగే జలాంతర్గాముల రహస్య వివరాలు ఎలా లీకు అయ్యాయన్న దానిపై వివరణ ఇవ్వాలని ఫ్రాన్స్ నౌకా నిర్మాణ సంస్ధ డిసిఎన్‌ఎస్‌నూ కోరారు. హ్యాకింగ్ కారణంగానే ఈ వివరాలు లీకు అయినట్టుగా స్పష్టమవుతోందని పారికర్ అన్నారు. ఈ పత్రాలు నూటికి నూరుశాతం భారత స్కార్పీన్ జలాంతర్గాములకు సంబంధించినవేనని తాను భావించడం లేదని, అందుకు కారణం ఈ జలాంతర్గాములకు సంబంధించి చివరిగా భారత్ కూడా తన అవసరాలకు తగ్గట్టుగా మార్పులు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఒకటి రెండు రోజుల్లో ఈ పత్రాలకు సంబంధించిన అసలు వ్యవహారం బయట పడుతుందని చెప్పారు. కాగా, జలాంతర్గాముల రహస్య వివరాలు బహిర్గతం కావడం ఆందోళన కలిగించే అంశమని నౌకాదళ వర్గాలు పేర్కొన్నాయి. మొదట్లో అనుకున్న డిజైన్ కాకుండా జలాంతర్గాముల నిర్మాణంలో ఎన్నో మార్పులు జరిగాయని, అయితే తాజాగా వెల్లడైన పత్రాల్లో తొలి డిజైన్‌కు సంబంధించిన వివరాలే ఉన్నాయని తెలిపాయి. జలాంతర్గాములు ఎంత లోతులో, ఎంత వేగంతో ప్రయాణం చేయగలుగుతాయి, వాటి లక్ష్య పరిథి ఎంత, ఎంత వేగంతో వెళ్లేటప్పుడు ఎలాంటి శబ్ధం వస్తుంది, వాటి యుద్ధ తంత్రం, రణ సామర్థ్యం ఎంత అనే అంశాలతో పాటు ఎన్నో కీలక సాంకేతిక వివరాలను ఆస్ట్రేలియా పత్రిక ప్రచురించింది. ఈ వివరాలు బహిర్గతమైన నేపథ్యంలో భారత్‌కు ప్రత్యర్థి దేశాలుగా ఉన్న చైనా లేదా పాకిస్తాన్ పంట పండినట్టేనని కూడా ఆ పత్రిక వ్యాఖ్యానించింది. జలాంతర్గాముల్లో పనిచేసే సిబ్బంది ఎక్కడ కూర్చుంటారు..ఎవరి కంటికీ కనిపించని రీతిలో రహస్యంగా వారు ఎలా సంభాషించగలుగుతారన్న వివరాలూ ఈ పత్రాల్లో వెలుగులోకి వచ్చాయి. మాగ్నటిక్, ఎలక్రో మాగ్నటిక్, ఇన్‌ఫ్రా రెండ్ డేటా కూడా ఈ పత్రాల ద్వారా వెల్లడైపోయింది. ఈ జలాంతర్గాములకు నీటి అడుగునా, ఉపరితలంలోనూ ఉండే కీలక సెన్సర్ల వివరాలను కూడా ఆస్ట్రేలియా పత్రిక వెల్లడించింది. వీటికి సంబంధించి 8వేల ఆరోందల పేజీలను బయట పెట్టింది. వీటి కమ్యూనికేషన్ వ్యవస్థ, టార్పిడో ప్రయోగ సామర్థ్యం, యుద్ధ తంత్ర వ్యవస్థ ఇలా ఒకటేమిటి అన్ని కీలక సాంకేతిక రహస్యాలూ బహిర్గతమైపోయాయి. కాగా, విదేశీ సంస్థల నుంచే ఈ వివరాలు బయట పడ్డాయని, భారత్ నుంచి ఇవి లీకు అయ్యే అవకాశమే లేదని చెబుతున్నారు.

బహిర్గతమైన రహస్యాలు
* కీలక సమాచారాన్ని సేకరించే శక్తి ఎంత
* ప్రయాణ వేగం..అప్పుడు వినిపించే ధ్వనిస్థాయి
* ఎంత లోతులో ప్రయాణిస్తాయి
* ఉపరితల, జలగర్భ సెన్సర్ల సామర్థ్యం
* కమ్యూనికేషన్, నేవిగేషన్ పాటవం