జాతీయ వార్తలు

మానవ పిరమిడ్ ఎత్తుపై ఆంక్షలను సవరించలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 24: మహారాష్టల్రో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పెద్దఎత్తున నిర్వహించే ‘దహీహండీ’ కార్యక్రమాల నిర్వాహకులకు ఇది ఎదురుదెబ్బ. దహీహండీని కొట్టడానికి ఏర్పాటయ్యే మానవ పిరమిడ్ ఎత్తు 20 అడుగులకు మించరాదని బొంబాయి హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను సవరించడానికి సుప్రీంకోర్టు బుధవారం నిరాకరించింది. ప్రస్తుతానికి మానవ పిరమిడ్ ఎత్తుపై జారీ అయిన ఆదేశాలను సవరించడం లేదని న్యాయమూర్తులు ఎఆర్ దవే, యుయు లలిత్, ఎల్.నాగేశ్వరరావుతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ప్రాచుర్యం పొందిన దహీహండీ పోటీలపై మానవ పిరమిడ్‌ల ఎత్తుపై విధించిన ఆంక్షలు ప్రతికూల ప్రభావం చూపిస్తాయని, అందువల్ల ఎత్తుపై ఆంక్షలను ఎత్తివేయాలని కోరుతూ ముంబయికి చెందిన ఓ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది. దహీ-హండీ కార్యక్రమంలో 18 సంవత్సరాల లోపు వయసు గలవారు పాల్గొనకూడదని, మానవ పిరమిడ్ ఎత్తు 20 అడుగులకు మించకూడదని బొంబాయి హైకోర్టు విధించిన ఆంక్షలను సవరించడానికి సుప్రీంకోర్టు ఆగస్టు 17న కూడా నిరాకరించింది. దహీహండీ బాగా ప్రాచుర్యం పొందిన క్రీడాపోటీ అని పిటిషనర్ చేసిన వాదనను కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. ‘ఈ పండుగ వల్ల ఒలింపిక్స్‌లో ఏదైనా పతకం వస్తుందా? నేను ముంబయికి చెందినవాడిని. ఈ పండుగ ఏదైనా పతకాన్ని తెస్తే నేను సంతోషిస్తాను’ అని జస్టిస్ దవే అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నవారు కొన్నిసార్లు తీవ్రంగా గాయపడుతున్నారని, ప్రత్యేకంగా వెనె్నముక వంటి కీలకమైన అంగాలు దెబ్బతింటున్నాయని న్యాయమూర్తి అన్నారు.