జాతీయ వార్తలు

హిందువుల్లో విడాకుల రేటు తక్కువే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 24: దేశవ్యాప్తంగా ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన జనాభా లెక్కల సేకరణలో దేశంలోని వివిధ మతాల్లో భార్యాభర్తల విడాకులు, విడిపోవడానికి సంబంధించి పలు ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. అన్ని మతాలకన్నా కూడా హిందువుల్లోనే విడాకుల రేటు చాలా తక్కువగా ఉందని దీనిలో వెల్లడయింది. హిందువుల్లో ప్రతి వెయ్యి మందికి 1.8 మంది మాత్రమే విడాకులు తీసుకున్నారట. హిందువులతో పోలిస్తే ముస్లింలలో విడాకులు తీసుకునే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ముస్లింలలో ప్రతి వెయ్యి మందికి 3.4మంది విడాకులు తీసుకుంటున్నారు. భర్త భార్యకు మూడుసార్లు తలాక్ చెప్పడం ద్వారా (ట్రిపుల్ తలాక్) విడాకులు తీసేసుకునే విధానం ఉండడమే ముస్లింలలో విడాకులు ఎక్కువగా ఉండడానికి కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే ముస్లింలలో విడాకులు తీసుకున్న వారిలో మహిళల వాటా ప్రతి వెయ్యి మందికి అయిదుగురుగా ఉంటే హిందువులు, సిక్కులు, జైన్‌లలో అది ప్రతి వెయ్యి మందికి 2-3 మందిగా మాత్రమే ఉంది. అంతేకాదు మన దేశంలో భార్యాభర్తలు విడాకులు తీసుకోవడం, వేరుపడ్డం క్రైస్తవులు, బౌద్ధుల్లో ఎక్కువగా ఉండగా జైన్‌లు, సిక్కుల్లో చాలా తక్కువగా ఉందని కూడా ఈ గణాంకాలను బట్టి తెలుస్తోంది. తాజాగా విడుదల చేసిన 2011 జన గణననుంచి ఈ డేటాను సేకరించారు.