జాతీయ వార్తలు

పేగుబంధమే గెలిచింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 24: శరీరాలు అతుక్కుని పుట్టిన కవల శిశువులను వేరు చేయడానికి ఆ పిల్లల తల్లి ససేమిరా ఇష్టపడకపోవడంతో దాదాపు మూడు వారాలుగా ఇక్కడి ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్న ఆ చిన్నారులను డిశ్చార్జి చేయక తప్పలేదు. ఆపరేషన్ చేస్తే తన పిల్లలు బతుకుతారో లేదోనన్న భయంతో తల్లి ఆపరేషన్‌కు ససేమిరా అంగీకరించకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో వారిని డిశ్చార్జి చేసినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. పుట్టిన పిల్లలు ఇద్దరు ఆరోగ్యంగానే ఉన్నట్లు ధ్రువీకరించిన తర్వాత గత శనివారంనాడు వాళ్లను డిశ్చార్జి చేసినట్లు సియాన్ ఆస్పత్రిలో చిన్న పిల్లల విభాగం చీఫ్ డాక్టర్ పరాస్ కొఠారి చెప్పారు. ఆపరేషన్‌కు తాము ఎంతగా నచ్చజెప్పినా పిల్లల తల్లి ఫరాన్ ఒప్పుకోలేదని, ఆపరేషన్ చేస్తే వాళ్లు తనకు ఎక్కడ దక్కకుండా పోతారోనని భయపడిన ఆమె వారు అలాగే ఉండడానికి ఇష్టపడిందని కొఠారి బుధవారం విలేఖరులకు చెప్పారు. డిశ్చార్జి చేసే సమయంలో తమ తరఫున ఒక ఆక్సిజన్ సిలిండర్ ఇవ్వడంతోపాటుగా, పిల్లల్లో అసాధారణమైన ప్రవర్తన కనిపిస్తే వెంటనే ఆస్పత్రికి తీసుకురావలసిందిగా సలహా ఇచ్చామని ఆయన చెప్పారు. గత నెల 27న 26 ఏళ్ల షహీన్ ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది. దాదాపు 3.6 కిలోల బరువుండే ఈ పిల్లలకు తల, మెడ వేరువేరుగా ఉన్నప్పటికీ గుండె, రొమ్ము భాగం, పొత్తికడువు, కడువు కింది భాగం అన్నీ కలిసే ఉన్నాయి. ఎనిమిదో నెల గర్భవతిగా ఉన్నప్పుడు షహీన్ తొలిసారిగా సోనోగ్రాఫీ చేయించుకున్నప్పుడు ఈ పిల్లల శరీరాలు రెండూ కలిసి ఉన్న విషయం ఆమెకు తెలిసింది. దాదాపు ఛాతీ దాకా పిల్లలిద్దరికీ ఒకే వెన్నుపూస ఉండడం వల్ల ఆపరేషన్ చేస్తే పిల్లల్లో ఒకరు మాత్రమే బతికే అవకాశాలున్నాయని డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. అయితే డాక్టర్లు ఎంత చెప్పినా షహీన్ మాత్రం ఆపరేషన్ చేయడానికి ఎంతమాత్రం అంగీకరించలేదు. పుట్టిన ఇద్దరూ ప్రాణాలతోనే ఉండాలని ఆమె గట్టిగా భావించడమే ఆపరేషన్‌కు ప్రధాన అడ్డంకిగా మారింది.