జాతీయ వార్తలు

అందరి సహకారంతోనే శాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 24: జమ్మూకాశ్మీర్ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు సహకరించే ప్రతిఒక్కరితోనూ చర్చలు జరపడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ బుధవారం ఇక్కడ స్పష్టం చేశారు. కేంద్రం చేపట్టిన చర్యలు కారణంగా కాశ్మీర్ సంక్షోభం త్వరితగతిన పరిష్కారం కాగలదన్న ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు.కాశ్మీర్‌లో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న హింస వెనక విదేశీ శక్తుల హస్తం ఉందని, సామాన్య పౌరులెవరూ ఇలాంటి పరిస్థితిని కోరుకోరని ప్రధాన మంత్రి కార్యాలయం సహాయ మంత్రిగా ఉన్న జితేంద్ర సింగ్ తెలిపారు. సాధ్యమైనంత త్వరగా కాశ్మీర్ సంక్షోభాన్ని చల్లార్చాలన్న ధ్యేయంతోనే కేంద్రం పనిచేస్తోందని, ఆ దిశంగా అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నట్టు వెల్లడించారు. కాశ్మీర్ లోయ సహా రాష్ట్రంలోని ప్రతి పౌరుడు కూడా ప్రశాంతతతో కూడిన వాతావరణానే్న కోరుకుంటున్నాడని తెలిపారు. విదేశీ శక్తుల అండదండలతో పనిచేస్తున్న కొందరు వ్యక్తులు మాత్రమే అరాచకాలు సృష్టిస్తున్నారని అన్నారు. కాశ్మీర్ యువతకు వాస్తవాలు అర్ధమయ్యాయని, ఈరకమైన కుట్రలను వారు తిప్పికొట్టే పరిస్థితి ఆసన్నమైందని మంత్రి స్పష్టం చేశారు. గత రెండు మూడు రోజులుగా రాష్ట్రంలో పరిస్థితి సాధారణ స్థాయి చేరుకుంటోందని, పూర్తిగా దీన్ని చక్కదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని మంత్రి తెలిపారు.