జాతీయ వార్తలు

కోలుకుంటున్న కాశ్మీర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, ఆగస్టు 24: కాశ్మీర్‌లోని అన్ని వర్గాలకు చేరువకావాలన్న లక్ష్యం దిశగా కేంద్రం మరో అడుగు ముందుకేసింది. కేంద్రం తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా హోమ్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బుధవారం కాశ్మీర్‌లో పర్యటించారు. నెల రోజుల వ్యవధిలో రెండోసారి కల్లోలిత రాష్ట్రానికి వచ్చిన ఆయన అన్ని రాజకీయ పార్టీల నాయకులతో చర్చలు జరిపారు. రాష్ట్ర సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనడానికి సంబంధిత వ్యక్తులు అందరితోనూ చర్చలు జరపడానికి కేంద్ర చొరవ చూపించాలని వివిధ రాజకీయ పార్టీలు ఆయనకు విజ్ఞప్తి చేశాయి. ఓ పక్క తాజాగా రాష్ట్రంలో పలుచోట్ల ఘర్షణలు జరుగుతున్న సమయంలోనే రాజ్‌నాథ్ ఈ పర్యటన చేపట్టారు. ఈ ఘర్షణలో ఓ వ్యక్తి మరణించాడు. తాజా పరిస్థితి దృష్ట్యా రాజ్‌నాథ్ రెండు రోజుల పర్యటనకు పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాటు చేశారు. రాజ్‌నాథ్‌కు ఏరకమైన నిరసనలు ఎదురుకాకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలూ తీసుకుంది.రాజ్‌నాథ్‌తో పాటు కేంద్ర హోమ్‌శాఖ కార్యదర్శి రాజీవ్ మెహ్‌రీషి ఇతర అధికారులు వచ్చారు. ఇక్కడి నెహ్రూ గెస్ట్‌హౌస్‌లోని భద్రత, ఆరోగ్యం సహా పలు కీలక విభాగం అధికారులతో రాజ్‌నాథ్ చర్చలు జరిపారు. ఆందోళనకారులను ఎదుర్కొనే సమయంలో గరిష్టస్థాయిలో సమ్యమనం పాటించాలని పారామిలటరీ దళాలను ఆయన కోరారు. రాష్ట్రంలో పరిస్థితి క్రమంగా మెరుగవుతోందని, ప్రజలకు నిత్యావసర వస్తుల సరఫరా నిరాటంకంగా జరుగుతున్నాయని అధికారులు రాజ్‌నాథ్‌కు వివరించారు. అనంతరం రాష్ట్ర పరిస్థితిని ఆయన సమీక్షించారు. ప్రతిపక్ష నేషనల్ కాన్ఫరెన్స్ బృందం హోమ్‌మంత్రిని కలుసుకుంది. అల్లర్లను అదుపుచేయడానికి పెలెట్ తుపాకులు వినియోగాన్ని నిషేధించాలని కోరింది. రాష్ట్రంలో పరిస్థితిని చక్కదిద్దటానికి సంబంధిత అన్ని వర్గాలతోనూ చర్చించాలని రాజ్‌నాథ్‌కు విజ్ఞప్తి చేసింది.
chitram...
శ్రీనగర్ విమానాశ్రయంలో హోమ్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు
స్వాగతం పలుకుతున్న కాశ్మీర్ ఉపముఖ్యమంత్రి నిర్మల్‌కుమార్ సింగ్