జాతీయ వార్తలు

మీడియాతో మాట్లాడవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 20: పార్లమెంటు భవనాన్ని సందర్శించే వారు మీడియాతో మాట్లాడవద్దని ప్రభుత్వం సలహా ఇచ్చింది. ‘మీడియాతో మాట్లాడవద్దని సందర్శకులను కోరుతున్నాం’ అని లోక్‌సభ సెక్రటేరియట్ జారీ చేసే జనరల్ పాస్‌లపై ఎర్ర అక్షరాలతో రాసి ఉంటోంది. అలాగే మొబైల్ ఫోన్లు, కెమెరాలు, తుపాకులులాంటి మారణాయుధాలను కూడా పార్లమెంటు భవనంలోపలికి తీసుకు రావద్దని సందర్శకులకు సూచించారు. అయితే సందర్శకులు మీడియాతో మాట్లాడకుండా నిషేధించడానికి పార్లమెంటు సెక్రటేరియట్ ఎలాంటి కారణాలను తెలపలేదు. నవంబర్ 25న ప్రారంభమైన పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 23న ముగియనున్న విషయం తెలిసిందే. మోదీ ప్రభుత్వం కాంగ్రెస్ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్న ఆరోపణలతో పాటు వివిధ అంశాలపై కాంగ్రెస్ పార్టీ చాలా రోజులుగా పార్లమెంటు సమావేశాలను స్తంభింపజేస్తున్న విషయం తెలిసిందే.