జాతీయ వార్తలు

ఆ భూములు వెనక్కి ఇచ్చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 31: పశ్చిమ బెంగాల్‌లో టాటా మోటార్స్ నానో కార్ల తయారీ ప్లాంట్‌కోసం గతంలో బుద్ధదేవ్ భట్టాచార్య ప్రభుత్వం జరిపిన భూ సేకరణ చెల్లదని సుప్రీంకోర్టు బుధవారం సంచలన తీర్పు చెప్పింది. భూ సేకరణ సక్రమమేనని పేర్కొంటూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ, నానో ప్లాంట్‌కోసం సేకరించిన సుమారు వెయ్యి ఎకరాల భూమిని రైతులకు తిరిగి ఇచ్చివేయాలని స్పష్టం చేసింది. సింగూరు ప్రాంతంలో నానో కార్ల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి 2006లో బుద్ధదేవ్ భట్టాచార్య నేతృత్వంలోని సిపిఎం ప్రభుత్వం దాదాపు వెయ్యి ఎకరాల భూమిని రైతులనుంచి సేకరించడం తెలిసిందే. అయితే మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టడం, పోలీసు కాల్పుల్లో పలువురు చనిపోవడం లాంటి సంఘటనల కారణంగా టాటాలు అక్కడ ప్లాంట్ ఏర్పాటు ఆలోచనను విరమించుకున్నారు. 2011లో అధికారంలోకి వచ్చిన వెంటనే మమతా బెనర్జీ ఆ భూములను వెనక్కి తీసుకోవడానికి ఒక చట్టాన్ని ఆమోదించడం, టాటాలు తమ ప్రాజెక్టును పశ్చిమ బెంగాల్‌నుంచి గుజరాత్‌కు తరలించడం తెలిసిందే. భూములను వెనక్కి తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని వ్యతిరేకిస్తూ టాటా మోటార్స్ హైకోర్టుకు వెళ్లింది. భూ సేకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టం రాజ్యాంగ వ్యతిరేకమని హైకోర్టు తీర్పు చెప్పడంతో ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది.
భూముల సేకరణకు సంబంధించి రైతులు చేసిన పిర్యాదులపై భూసేకరణ కలెక్టర్ దర్యాప్తు సక్రమంగా నిర్వహించలేదని సుప్రీంకోర్టు బెంచ్ పేర్కొంది. అంతేకాదు భూమికి బదులుగా నష్టపరిహారం తీసుకున్న రైతులు దాన్ని తిరిగి ఇవ్వాల్సిన పని లేదని, ఎందుకంటే పదేళ్లుగా వారు తమ భూములపై ఎలాంటి ఫలాలను అనుభవించలేదని న్యాయమూర్తులు వి గోపాల గౌడ, అరుణ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
చరిత్రాత్మక విజయం: మమత
సుప్రీంకోర్టు తీర్పుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందిస్తూ ఇది చరిత్రాత్మక విజయమని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పును ఎలా అమలు చేయాలనే దానిపై ప్రభుత్వం గురువారం ఒక సమావేశం నిర్వహిస్తుందని చెప్పారు. ‘పదేళ్లుగా ఈ తీర్పుకోసం ఎదురు చూశాం. ఇది రైతుల విజయం’ అని అన్నారు.

రైతులకు భూములను వాపసు చేయడానికి ఒక కార్యాచరణను రూపొందిస్తామని ఆమె చెప్పారు. ఈ ఏడాది మే నెలలో న్యాయమూర్తులు గోపాల గౌడ, అరుణ్ మిశ్రలతో కూడిన బెంచ్ ఈ కేసుకు సంబంధించి టాటాలు, బెంగాల్ ప్రభుత్వం, సింగూరు రైతుల వాదనలను విన్న తర్వాత తన తీర్పును వాయిదా వేసింది.

కోర్టు తీర్పు వెలువడిన అనంతరం సంబరాలు చేసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు