జాతీయ వార్తలు

ఉగ్రవాద ముఠాలకు రాజకీయ పార్టీల మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, సెప్టెంబర్ 21: పాకిస్తాన్‌లోని రాజకీయ, మత పార్టీలన్నీ కూడా తమ ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నాయని పాక్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అన్వర్ జహీర్ జమాలీ విమర్శించారు. దేశంలో కొత్త జ్యుడీషియల్ సంవత్సరం అపారంభమైన సందర్భంగా సోమవారం జరిగిన ఓ బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. ‘కొన్ని రాజకీయ పార్టీలు తమ ప్రయోజనాల పరిరక్షణ కోసం ఉగ్రవాదాన్ని సమర్థించడం విచారకరం’ అని జమాలీ అన్నట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి. భారత్‌లో ఉగ్రవాద దాడులతో తమకు ఎలాంటి సంబంధాలు లేవని పాకిస్తాన్ ఎప్పుడూ వాదిస్తూ రావడం తెలిసిందే. తాజాగా జమ్మూ, కాశ్మీర్‌లోని ఉరీ సెక్టార్‌లో సైనిక స్థావరంపై జరిగిన ఉగ్రదాడి విషయంలో పాక్ అదే పాట పాడుతోంది. ఈ నేపథ్యంలో పాక్ సుప్రీంకోర్టు ప్రదాన న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం, పాకిస్తాన్‌లో పరిపాలనకు సంబంధించిన అన్ని వ్యవస్థలు సక్రమంగా పని చేసినట్లయితే దేశం ఒక సుస్థిర దేశంగా మారుతుందని జమాలి అన్నారు. అన్ని మతాల వారు తమకు నచ్చిన మతాన్ని పాటించడానికి పాక్ రాజ్యాంగం అవకాశమిస్తోందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. రాజకీయ పార్టీలు అంతర్గతంగా మద్దతు ఇస్తున్న కారణంగానే లాయర్లు, జడ్జీల్లో భయోత్పాతాన్ని కలిగించడానికి ఉగ్రవాద గ్రూపులు కోర్టులను సైతం బెదిరిస్తున్నాయని ఆయన అన్నారు. ఉగ్రవాదంనుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడేది న్యాయ వ్యవస్థలే అయినందున న్యాయ వ్యవస్థలకు పటిష్ఠమైన భద్రతను ఏర్పాటు చేయాలని ఆయన పాక్ భద్రతా ఏజన్సీలకు విజ్ఞప్తి చేశారు. కాగా, జమాలి వ్యాఖ్యలు అక్షర సత్యాలే కాకుండా దేశంలోనిచాలా మంది ఇన్ని సంవత్సరాలుగా చెప్తున్న మాటలు నిజమనే విషయాన్ని నిరూపిస్తున్నాయని చీఫ్ జస్టిస్ వ్యాఖ్యలపై వ్యాఖ్యానిస్తూప్రముఖ పాక్ దినపత్రిక ‘డాన్’ వ్యాఖ్యానించింది.
‘కుల వృత్తులను
అధ్యయనం చేయండి’
ఆంధ్రభూమి ప్రతినిధి
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: దేశంలో సంప్రదాయ కుల వృత్తులపై అధ్యయనం చెయ్యడంతో పాటు పూర్తి స్థాయిలో గణాంకాలపై దృష్టి పెట్టాలని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియాను టిఆర్‌ఎస్ ఎంపి బూర నర్సయ్యగౌడ్ కోరారు. బూర నర్సయ్యగౌడ్ బుధవారం పనగరియాతో నీతి ఆయోగ్ భవన్‌లో సమావేశమయ్యారు. అనంతరం నర్సయ్య గౌడ్ విలేఖరులతో మాట్లాడుతూ దేశంలోని కుల వృత్తులకు సంబంధించిన వివరాలను నీతి ఆయోగ్ కోరినట్లు తెలిపారు.