జాతీయ వార్తలు

చొరబాట్లపై ఉక్కుపాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28:సరిహద్దు చొరబాట్లను పూర్తి శక్తితో తిప్పికొట్టాలని సైనిక దళాలను రక్షణ మంత్రి మనోహర్ పారీకర్ ఆదేశించారు. ఉరీ సైనిక శిబిరంపై ఉగ్రవాద దాడి నేపథ్యంలో నెలకొన్న భద్రతా పరిస్థితిపై త్రివిధ దళాల అధిపతులతో బుధవారం ఆయన సమీక్ష జరిపారు.
ఒక వేళ అనివార్య పరిస్థితులు తలెత్తితో వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలన్న అంశాన్నీ ఆయన చర్చించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా పదాతి,నౌకా, వైమానిక దళాల సన్నద్ధతపైనా ఈ సమావేశంలో మదింపు జరిగినట్టు చెబుతున్నారు. ముఖ్యంగా సరిహద్దుల్లో ఎలాంటి చొరబాటు ప్రయత్నం జరిగినా ఉపేక్షించవద్దని, పూర్తి శక్తిసామర్థ్యాలతో ప్రతిదాడులకు దిగాలని సైన్యాన్ని రక్షణ మంత్రి ఆదేశించినట్టుగా ఓ జాతీయ చానల్ కథనాన్ని బట్టి స్పష్టమవుతోంది. పాకిస్తాన్‌పై క్రమానుగతంగా దౌత్యపరమైన ఒత్తిడి పెంచుతున్న భారత్ మంగళవారం ఉరీ దాడికి సంబంధించి పాకిస్తాన్ ఉగ్రవాదుల ప్రమేయాన్ని ఎండగట్టింది. పాకిస్తాన్ హైకమిషనర్ బాసిత్‌ను పిలిపించి దాడుల ఆధారాలు, సాక్ష్యాలనూ అందించింది. ఉరీ వెనుక పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాదుల హస్తం ఉందని చెప్పడానికి వీటిని రుజువులుగా అందించింది. ఈ నేపధ్యంలో ఇక సరిహద్దు చొరబాట్లపై కనికరం వద్దని రక్షణ మంత్రి సైన్యాన్ని ఆదేశించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.