జాతీయ వార్తలు

7లోగా మెడికల్ అడ్మిషన్ల పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబరు 28: వైద్య కళాశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియను అక్టోబరు 7నాటికి పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు బుధవారం ఆదేశించింది. అలాగే ఏపీలోని 15శాతం అన్ రిజర్వ్‌డ్ కోటాలో తెలంగాణ విద్యార్థులకూ ప్రవేశాలు కల్పించాలని సుప్రీంకోర్టు తెలిపింది. అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయడానికి మరో పక్షంరోజులపాటు అవకాశం ఇవ్వాలన్న తెలంగాణ విజ్ఞప్తిని అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. అడ్మిషన్ల ప్రక్రియను పది రోజుల్లో (అక్టోబర్ 7నాటికి) పూర్తి చేయాలని ఆదేశించింది. మెడికల్ సీట్ల భర్తీకి కౌనె్సలింగ్ ప్రక్రియ గడువు పొడిగించాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దాంతో ఏపీ ప్రభుత్వం, ఏపీలోని ప్రైవేటు వైద్య కళాశాలల యాజమాన్య సంఘాలు తెలంగాణలో మెడికల్ అడ్మిషన్ల గడువు పెంచితే ఏపీలోనూ పెంచాలని సుప్రీంకోర్టులో వేరువేరుగా పిటిషన్‌లు దాఖలు చేశాయి. బుధవారం న్యాయమూర్తులు జస్టిస్ అనిల్ ఆర్ దవే, జస్టిస్ ఎల్ నాగేశ్వర్ రావు, జస్టిస్ లలిత్‌లతో కూడిన ధర్మాసనం వీటిని విచారించింది. ముందుగా తెలంగాణ తరపున అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ మెడికల్ సీట్ల భర్తీకి నిర్వహించిన ఎంసెట్ పేపర్ లీక్ అవ్వడంతో ఎంసెట్-3 నిర్వహించామని, అందువల్ల వైద్య కళాశాలలో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేసేందుకు మరో పదిహేను రోజులు గడువు కావాలని కోరారు. ఏపీ తరపున సీనియర్ న్యాయవాది రాజగోపాల రావు వాదనలు వినిపిస్తూ రాజ్యాంగంలోని 371-డి ఏపీకి సైతం వర్తిస్తున్నందున, 15శాతం సీట్లు తెలంగాణ నుంచి ఏపీకి, ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ అవుతున్నాయని, అందువల్ల ఏపీకీ అడ్మిషన్ల ప్రక్రియ గడువు పెంచాలని కోర్టును కోరారు. ఇదే వాదనను ప్రైవేటు కళాశాలల యాజమాన్యాల తరపు న్యాయవాది సైతం వినిపించారు. దీంతో తెలుగు రాష్ట్రాల వాదనలపై జాతీయ వైద్య విద్యామండలి అభ్యంతరం వ్యక్తం చేసింది. జాతీయ వైద్య విద్యామండలి తరఫున సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ వాదనలు వినిపిస్తూ గతంలో సుప్రీంకోర్టు తీర్పులో దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో సెప్టెంబరు 30నాటికి అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలిచ్చిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేసేందుకు ఇంకా రెండు రోజులు సమయం ఉందని, రెండు రాష్ట్రాలు తమ వైద్య కళాశాలల సీట్ల భర్తీకి మొదటి విడత కౌనె్సలింగ్ ఇప్పటికే పూర్తి చేశాయని కోర్టుకు తెలిపారు. ఇప్పుడు తెలంగాణ మెడికల్ కౌనె్సలింగ్ గడువు పొడిగిస్తే, దేశంలోని మిగిలిన రాష్ట్రాలు కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని ధర్మాసనానికి వివరించారు. దేశవ్యాప్తంగా వైద్య సీట్ల అడ్మిషన్ల ప్రక్రియ సెప్టెంబరు 30నాటికి పూర్తి చెయ్యాల్సివున్నా, విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని గడువు పొడిగించాలన్న తెలుగు రాష్ట్రాల విజ్ఞప్తిని ధర్మాసనం పరిశీలించి, తెలంగాణలోని వైద్య కళాశాలల అడ్మిషన్ల ప్రక్రియ అక్టోబరు 7లోగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఏపీలోని 15శాతం అన్ రిజర్వుడు కోటలో తెలంగాణ విద్యార్థులకు అవకాశం కల్పించాలని తీర్పులో సుప్రీంకోర్టు పేర్కొంది.