జాతీయ వార్తలు

ఎస్పీ, బిఎస్పీలను తరిమేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మథుర, సెప్టెంబర్ 28: ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీ గూండా రాజ్యాన్ని ఏర్పాటు చేసిందని, అభివృద్ధిని వేగవంతం చేయడంలో చాచా-్భతీజా ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బుధవారం దుయ్యబట్టారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీ, బిఎస్పీలను పూర్తిగా తుడిచిపెట్టే విధంగా బిజెపిని గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. గత 15 ఏళ్లలో ఉత్తరప్రదేశ్‌లో బిఎస్‌పి, సమాజ్‌వాది పార్టీలు ఒకదాని తర్వాత మరొకటి అధికారంలో ఉన్నాయని, ఈ 15 ఏళ్ల కాలంలో చాలా రాష్ట్రాలు ఎంతో అభివృద్ధి చెందితే యుపిలో మాత్రం ఎలాంటి అభివృద్ధీ జరగలేదని ఆయన అన్నారు. బిజెపి ప్రభుత్వం పేదల అభివృద్ధికి కంకణం కట్టుకుందని ఆయన చెప్పారు. ‘చాచా-్భతీజాల ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయజాలదని నేను, బిజెపి కార్యకర్తలు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ అంటున్నారు’ అని అమిత్ షా బుధవారం జనసంఘ్ సిద్ధాంత కర్త అయిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ జన్మస్థలమైన మథురలో ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ అన్నారు. యుపి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, ఆయన మంత్రివర్గంలో సీనియర్ మంత్రిగా ఉన్న ఆయన చిన్నాన్న శివపాల్‌యాదవ్‌ల మధ్య ఇటీవల తలెత్తిన విభేదాలను ప్రస్తావిస్తూ అమిత్ షా ఈ విమర్శలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో ప్రకృతి వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ సమాజ్‌వాది పార్టీ, బిఎస్పీలు రాష్ట్రాన్ని అత్యంత వెనుకబడిన రాష్ట్రంగా తయారు చేశారని, ‘అవినీతితో నిండిన మాయావతి ప్రభుత్వాన్ని, సమాజ్‌వాది పార్టీ గూండా రాజ్యాన్ని మీరు ఎంతకాలం భరిస్తారు? ఆ రెండు పార్టీలను తుడిచిపెట్టి బిజెపికి ఒక అవకాశం ఇవ్వండి’ అని అన్నారు. తన రాష్టమ్రైన గుజరాత్‌లో భూమిలో 1200 అడుగుల లోతులో నీళ్లున్నాయని, అదే యుపిలో గంగ, యమున లాంటి జీవనదులున్నాయని, అయినప్పటికీ ఈ రాష్ట్రం వెనుకబడి ఉందని ఆయన అన్నారు. సమాజ్‌వాది పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు గూండాలు రాజ్యమేలుతారని, అదే మాయావతి అధికారంలోకి వచ్చినప్పుడు అవినీతి పెచ్చుమీరిపోతుందని అన్నారు. ప్రజల్లో ఈ పార్టీల పట్ల ఆగ్రహం ఉందని, వారు మార్పును కోరుకుంటున్నారని అన్నారు. అందువల్ల బిజెపిని గెలిపించాలని, తమ పార్టీ ప్రభుత్వం దీనదయాళ్ ఉపాధ్యాయ్ చూపించిన బాటలో నడుస్తుందని, అన్ని కులాలు, మతాల వారి అభివృద్ధికోసం కృషి చేస్తుందని చెప్పారు. ఉత్తరప్రదేశ్ అభివృద్ధి చెందితే దేశ జిడిపి 10 శాతం దాటిపోతుందన్నారు. కేంద్రం, రాష్ట్రాల్లోని బిజెపి ప్రభుత్వాలు దీనదయాళ్ ఉపాధ్యాయ్ శతజయంతి సంవత్సరాన్ని ‘గరీబ్ కల్యాణ్ వర్ష్’గా పాటిస్తున్న విషయం తెలిసిందే.