జాతీయ వార్తలు

సల్మాన్‌కు మళ్లీ చిక్కులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 23: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ మళ్లీ చిక్కుల్లో పడే అవకాశాలు ఉన్నాయి. 2002 నాటి ఢీకొట్టి పారిపోయిన (హిట్ అండ్ రన్) కేసులో సల్మాన్ ఖాన్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ బొంబా యి హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సల్మాన్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ హైకోర్టు న్యాయమూర్తి ఎ.ఆర్.జోషి ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో స్పెష ల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్‌పి) దాఖలు చేయనున్నట్లు ప్రభుత్వం బుధవారం బొంబాయి హైకోర్టుకు తెలిపింది. హిట్ అండ్ రన్ కేసులో ట్రయల్ కోర్టు సల్మాన్‌కు అయిదేళ్ల కారాగార శిక్ష విధించగా, హైకోర్టు అందుకు పూర్తి విరుద్ధంగా అతన్ని నిర్దోషిగా ప్రకటించిన విషయం తెలిసిందే.