జాతీయ వార్తలు

అంతులేని మిస్టరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశవ్యాప్తంగా అత్యంత విస్మయకరమైన దిగ్భ్రాంతికరమైన నేర ఘట్టాల్లో షీనా బోరా కేసును ప్రధానంగా పేర్కొనాలి. నేరం, హత్య కలగలసిన ఈ కేసు రోజురోజుకూ కొత్త మలుపు తిరుగుతూ దర్యాప్తు సంఘాలకే సవాలు విసురుతోంది. దాదాపు అన్ని చానళ్లలోనూ ఆగస్టునుంచి నేటి వరకూ కూడా షీనాబోరా కేసుకు సంబంధించిన మిస్టీరీలు మారుమోగుతూనే ఉన్నాయి. స్టార్ ఇండియా మాజీ సిఇఓ పీటర్ ముఖర్జియా భార్య ఇంద్రాణి ముఖర్జియా నిందితురాలిగా ఉన్న ఈ కేసు ఏ విధంగా మలుపుతిరుగుతుందన్నది ఉత్కంఠను రేకెత్తించింది. తన కుమార్తె షీనాబోరాను ఇంద్రాణియే హత్య చేసిందని చెప్పడానికి బలమైన సాక్ష్యాధారాలను దర్యాప్తు సంస్థలు సేకరించాయి. అనేక మలుపులు, విస్మయకరమైన ఘట్టాలు ఈ కేసును అడుగడుగునా ఉత్కంఠభరితంగా మా ర్చాయి.
కేసులో ఇంద్రాణి మాజీ భర్తలు సంజీవ్‌ఖన్నా, పీటర్ ముఖర్జియా, అలాగే ఆమె మాజీ డ్రైవర్ శ్యాంవర్ రాయ్‌లపై అనేక కేసులు దాఖలయ్యాయి. కిడ్నాప్, కుట్ర, హత్య, సాక్ష్యాధారాల తారుమారు వంటి అభియోగాలను దాఖలు చేశారు.