జాతీయ వార్తలు

భేష్..కుమార్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పల్లన్‌వాలా, అక్టోబర్ 7: ఫిరంగుల మోతకు అతడు వెరవలేదు. ఒళ్లు జలదరించే భయానక వాతావరణం, సైనికుల బూట్ల చప్పుళ్లు అతడి లక్ష్యాన్ని నిలువరించలేకపోయాయి. పదిహేనేళ్ల సురీందర్ కుమార్ అనే టెన్త్ విద్యార్థి ధైర్య సాహసాలకు ఫిదా అవ్వాల్సిందే. పల్లన్‌వాలా సెక్టార్ గతనెల 28-29 తేదీల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో భారత సైన్యం సర్జికల్ స్ట్రయిక్ చేపట్టిన రోజది. ముందు జాగ్రత్తగా గిగ్రియాల్ గ్రామంతో సహా అనేక సరిహద్దు పల్లెలను అప్పటికప్పుడు ఖాళీ చేయించారు. ఆ భయానక పరిస్థితుల్లో కుమార్ కుటుంబ సభ్యులతో కలసి తాత్కాలిక శిబిరానికి వెళ్లిపోయాడు. కట్టుబట్టలతోనే గ్రామస్తులంతా తరలిపోయారు. ఈ అయోమయ పరిస్థితుల్లో కుమార్ స్కూల్ బ్యాక్ ఇంటివద్దే వదిలేశాడు. అయితే తాత్కాలిక శిబిరానికి చేరుకున్నాడే గాని అతడి ధ్యాస అంతా పుస్తకాలపైనే ఉంది. ఆ రాత్రంగా అతడు నిద్ర ఎరగడు. తెల్లవారగానే లేచి స్కూల్‌బ్యాగ్ కోసం ఇంటికి బయలుదేరాడు. కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంటికి కాలినడగనే చేరుకున్న సురీందర్ స్కూలుబ్యాగు తీసుకుని ఆనందంలో తేలిపోయాడు. మార్గమధ్యంలో సైనికులు అడ్డుకున్నా పుస్తకాల కోసం వెళ్తున్నానని చెప్పేవాడినని కుమార్ తెలిపాడు. తన ఆవేదనను అర్ధం చేసుకున్న ఓ అధికారి తనకు పూర్తి సహకారం అందించారని అన్నాడు. ‘నేను బ్యాగు తీసుకుని తిరుగుప్రయాణంలో ఉండగానే మా గ్రామం ఫిరంగుల మోతతో దద్దరిల్లిపోయింది. భయం భయంగానే తాత్కాలిక శిబిరానికి చేరుకున్నాను’ అని విద్యార్థి చెప్పాడు. పశువులు, వెచ్చాల కోసం ఇళ్లకు వెళ్లిన గ్రామస్తులు అందరూ బితుకుబితుకు మంటునే శిబిరానికి చేరుకున్నారు. ఇలా ఉండగా కుమార్ ప్రస్తుతం ఖౌర్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన తాత్కాలిక శిబిరంలోనే కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు. మరోపక్క కుమార్ వంటి విద్యార్థులు నష్టపోకుండా కాశ్మీర్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వాళ్లుంటున్న శిబిరాల్లోనే ప్రత్యేక తరగతులు నిర్వహించాలని జమ్మూ డిప్యూటీ కమిషనర్ సిమ్రాన్‌దీప్ సింగ్ అధికారులను ఆదేశించారు. ఇళ్లకు తిరిగి వెళ్లేవరకూ వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆయన సూచించారు. కుమార్ లాంటి విద్యార్థులు 80 మందికి ప్రత్యేక క్లాసులు నడుపుతున్నట్టు ఖౌర్ ప్రభుత్వ పాఠశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ రోషన్‌లాల్ శర్మ వెల్లడించారు.