జాతీయ వార్తలు

హద్దు మీరి మాట్లాడుతున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 7: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రమూకల శిబిరాలపై భారత సైన్యం జరిపిన మెరపుదాడులను (సర్జికల్ స్ట్రైక్స్) కొంతమంది రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అంటూ ఇది సరికాదన్నారు. ఈ సందర్భంగా సైనికుల రక్తంతో వ్యాపారం చేస్తున్నారంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్రమోదీపై చేసిన వ్యాఖ్యలను అమిత్‌షా తీవ్రంగా తప్పుబడుతూ, రాహుల్ గాంధీ హద్దులు మీరుతున్నారని, మన సైనికుల శౌర్యప్రతాపాలను అవమానిస్తున్నారని అన్నారు. లక్షిత దాడుల పట్ల ప్రజల్లో పెల్లుబుకుతున్న ఆనందోత్సాహాల్లో పాలు పంచుకోవడానికి బదులు కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ లాగా మాట్లాడుతూ ఉందని ఆయన అన్నారు. మన సైన్యం ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి ఈ దాడులపై తాము ప్రజల ముందుకు వెళతామని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు, ఉగ్రవాదం విషయంలో ఏమాత్రం సహించరాదన్న మోదీ ప్రభుత్వ విధానానికి, అలాగే కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో ప్రభుత్వ బలమైన రాజకీయ దృఢచిత్తానికి ఈ దాడులు అద్దం పడుతున్నాయని ఆయన అన్నారు. అలాగే లక్షిత దాడులపై అనుమానాలు వ్యక్తం చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్‌పైన కూడా అమిత్ షా మండిపడ్డారు. ఈ దాడులను బిజెపి రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటోందన్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చు తూ, తమ పార్టీ నాయకులెవరూ ఎలాంటి ప్రకటనా చేయలేదని, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రమూకల స్థావరాలపై దాడులు జరిపిన విషయాన్ని విలేఖరుల సమావేశంలో ప్రకటించింది డిజిఎంఓయే తప్ప రక్షణ మంత్రి కాదని అన్నారు. ఒకవైళ స్థానిక నేతలుఎవరైనా ఏదయినామాట్లాడితే దాన్ని పార్టీ వైఖరిగా భావించరాదని కూడా అమిత్ షా అన్నారు. ఈ పరిణామం పట్ల మొత్తం దేశం సంతోషంగా ఉందని, బిజెపి కార్యకర్తలు ఆ సంతోషంలో పాలుపంచుకుంటున్నారన్నారు. కాగా, జవాన్ల రక్తంతోప్రధాని మోదీ వ్యాపారం చేస్తున్నారంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవా? లేక పార్టీవా అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలన్నారు.
పోస్టర్ యుద్ధం ఆపండి: సిబల్
కాగా, తమ నాయకుడు రాహుల్ గాంధీపై బిజెపి అధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తిప్పి కొడుతూ, జైళ్లలో గడిపి వచ్చిన వ్యక్తులు ఇప్పుడు తమ పార్టీ మూలస్తంభాలపైనే విమర్శలు చేస్తున్నారంటూ పరోక్షంగా షాపై ధ్వజమెత్తింది. అంతేకాదు తాను ఏమాట్లాడుతున్నానో రాసుల్ గాంధీకి బాగా తెలుసన్నారు. మాజీ అపధానులు జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీలను అమిత్ షా విమర్శించడాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ తీవ్రంగా తప్పుబడుతూ రాజకీయంగా బురద చల్లుకోవడం ప్రజాస్వామ్యానికి హానికరమన్న విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అమిత్ షాకు చెప్తే బాగుంటుందని అన్నారు. అంతేకాదు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రమూకల శిబిరాలపై సైన్యం జరిపిన మెరపుదాడులను మోదీ ప్రభుత్వ విజయంగా గొప్పలు చెప్పుకుంటూ పోస్టర్లు, కటౌట్లతో బిజెపి ప్రచారం చేసుకోవడం ఆపాలని, అలా ప్రచారం చేసుకుంటే అనుమానాలు కూడా మొదలవుతాయన్న విషయాన్ని ఆ పార్టీ గుర్తించాలన్నారు.

న్యూఢిల్లీలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న
బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా