జాతీయ వార్తలు

ఈ ఏడాది జాతీయ రాజకీయాల్లో అనేక కీలక పరిణామాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత జాతీయ రాజకీయాల్లో అనేక కీలక పరిణామాలకు ఈ ఏడాది వేదికగా నిలిచింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన నరేంద్ర మోదీ సారథ్యంలోని బిజెపికి ఈ ఏడాదికి పలు రాష్ట్రాల్లో ఎన్నికల్లో చుక్కెదురైంది. బిహార్, ఢిల్లీ, అసెంబ్లీ ఎన్నికలతో పాటు కేరళ, గుజరాత్‌లలో జరిగిన స్థానిక ఎన్నికల్లో కూడా బిజెపి కంగుతింది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కొంతలో కొంతైనా పుంజుకోవడానికి, ఆవిధంగా తన ఉనికిని చాటుకోవడానికి ఆస్కారమేర్పడింది. లోక్‌సభలో మెజారిటీ ఉన్నా, రాజ్యసభలో ముందుకు కదలలేని పరిస్థితి మోదీ ప్రభుత్వానికి ఏర్పడింది. దేశ రాజకీయ చరిత్రలో తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరచుకొని శాస్త్ర, సాంకేతిక రంగాల్లో తనదైన ముద్ర వేసిన అబ్దుల్ కలాం సహా అనేకమంది ప్రముఖులు ఈ ఏడాదిలోనే వీడ్కోలు పలికారు. దేశవ్యాప్తంగా సంచలనాన్ని రేకెత్తించిన షీనాబోరా కేసుతో పాటు మాఫియా డాన్ చోటా రాజన్ అరెస్టు మొదలైన పరిణామాలకు 2015 కేంద్ర బిందువైంది.