జాతీయ వార్తలు
ఐసిహెచ్‌ఆర్ చైర్మన్ యల్లాప్రగడ రాజీనామా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ, నవంబర్ 27: భారత చరిత్ర పరిశోధనా మండలి (ఐసిహెచ్‌ఆర్) చైర్మన్‌గా నియమితులై 16 నెలలు తిరక్కముందే యల్లాప్రగడ సుదర్శన రావు‘వ్యక్తిగత కారణాల’పై ఆ పదవికి రాజీనామా చేశారు. సుదర్శన రావుకు నెలకు లక్షన్నర రూపాయల గౌరవ వేతనం మంజూరు చేయాలన్న ప్రతిపాదనను మానవ వనరుల మంత్రిత్వ శాఖ తోసిపుచ్చడంపై ఆయన అసంతృప్తితో ఉన్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. ఐసిహెచ్‌ఆర్ పదవికి తన రాజీనామా లేఖను పంపించానని, మంత్రిత్వ శాఖ సమాధానం కోసం ఎదురు చూస్తున్నానని రావు చెప్పారు. కాకతీయ యూనివర్సిటీలో పనిచేసి రిటైరయిన సుదర్శన రావును ఐసిహెచ్‌ఆర్ చైర్మన్ పదవిలో మూడేళ్ల కాలానికి నియమించడం జరిగింది.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)కు అనుబంధంగా ఉన్న అఖిల భారతీయ ఇతిహాస్ సంకలన్ యోజన సభ్యుడయిన సుదర్శనరావును ఐసిహెచ్‌ఆర్ చైర్మన్‌గా నియమించడం వివాదాస్పదం కావడమేకాక ఈ పదవికి ఆయనకున్న అర్హతలేమిటని రోమిల్లా థాపర్‌లాంటి కొందరు చరిత్రకారులు విమర్శించారు కూడా. రావు తన రాజీనామా లేఖను ఈ నెల 24న మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీకి పంపించినట్లు తెలుస్తోంది.
సుదర్శనరావుకు గౌరవ వేతనం మంజూరు చేయాలన్న ప్రతిపాదన గత సెప్టెంబర్ 23న జరిగిన ఐసిహెచ్‌ఆర్ జనరల్ కౌన్సిల్ సమావేశంలో చర్చకు రాగా, కౌన్సిల్ సభ్యులు మద్దతు తెలపడంతోపాటు ఆ ప్రతిపాదనను మానవ వనరుల శాఖకు పంపించడం కూడా జరిగింది. కాగా, ‘వ్యక్తిగత కారణాలను’ చూపిస్తూ రావు పంపిన రాజీనామా లేఖ అందిందని, దీనిపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. అంతేకాదు ఐసిహెచ్‌ఆర్ చైర్మన్ పదవి గౌరవ పదవి మాత్రమేనని కూడా వారు చెప్పారు. సుదర్శనరావు వ్యక్తం చేసిన పలు అభిప్రాయాలు గతంలో వివాదాస్పదం అయ్యాయి. ప్రాచీన కుల వ్యవస్థ బాగా పని చేసిదంటూ ఒక బ్లాగులో ఆయన చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి.