జాతీయ వార్తలు

మొయిన్ ఖురేషీ అరెస్టు.. మళ్లీ పరార్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 15: మనీ లాండరింగ్ కేసులో దుబాయ్‌కి చెందిన వివాదాస్పద మాంసం ఎగుమతిదారుడు మొయిన్ ఖురేషీని అధికారులు శనివారం న్యూఢిల్లీ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. మనీ లాండరింగ్ కేసులో ఖురేషీకి వ్యతిరేకంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) జారీ చేసిన లుకౌట్ సర్క్యులర్ (ఎల్‌ఓసి) ఆధారంగా అధికారులు ఆయనను అరెస్టు చేశారు.
అయితే ఆదాయ పన్ను కేసులో కోర్టు జారీ చేసిన ఉత్తర్వును చూపించి కొద్దిసేపటికే ఖురేషీ అక్కడి నుంచి మళ్లీ విమానంలో దుబాయ్‌కి పారిపోవడంతో అధికారులు నివ్వెరపోవాల్సి వచ్చింది. ఈ వ్యవహారంపై ఇమ్మిగ్రేషన్ అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. ఖురేషీని అరెస్టు చేసిన విషయాన్ని ఇమ్మిగ్రేషన్ అధికారులు ఇడికి తెలియజేయగానే అతను తన విమానయానానికి ఎటువంటి అడ్డంకులు లేవని పేర్కొంటూ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను చూపించాడు.

దీంతో ఇమ్మిగ్రేషన్ అధికారి ఆ ఉత్తర్వు నిజమైనదా కాదా అనే విషయాన్ని పరిశీలించిన తర్వాత ఖురేషీని మళ్లీ దుబాయ్‌కి వెళ్లిపోయేందుకు అనుమతించాడు.