జాతీయ వార్తలు

ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికుడు కాలే మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 15: నేతాజీ సుభాశ్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్‌లో సైనికుడిగా పనిచేసిన డానియెల్ కాలే కన్నుమూశారు. కొంత కాలంగా అస్వస్థతతో బాధపడుతున్న 95 ఏళ్ల కాలే మహారాష్టల్రోని కొల్హాపూర్‌లో మృతి చెందారు. ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చేరిన కాలే శుక్రవారం ఉదయం 8 గంటలకు తుది శ్వాస విడిచారు. పౌరుల సంక్షేమంకోసం పాటుపడుతున్న స్వచ్ఛంద సంస్థ ‘వైట్ ఆర్మీ’ వ్యవస్థాపకుడు అశోక్ రొకాడే.. చివరి రోజులలో కాలే బాగోగులు చూశారు. కాలే అంత్యక్రియలు శుక్రవారం సాయంత్రం కదంవాడి శ్మశానవాటికలో జరిగినట్లు రొకాడే తెలిపారు. కొల్హాపూర్ జిల్లా పన్హాలా తాలుకాలో 1920 సెప్టెంబర్‌లో జన్మించిన కాలే రస్‌బిహారి బోస్‌కు చెందిన ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్‌లో 1942లో చేరారు.
ఈ లీగ్ తరువాత కాలంలో ఆజాద్ హింద్ ఫౌజ్‌లో విలీనమయింది. ఆజాద్ హింద్ ఫౌజ్‌లో కాలే భారత్-బర్మా సరిహద్దుల్లో విధులు నిర్వర్తించారు. ‘్ఫజ్‌కు చెందిన సీక్రెట్ సర్వీస్ గ్రూప్‌లో కాలే పనిచేశారు. ఈ గ్రూప్.. ఫౌజ్‌కు నిఘా సంస్థగా పనిచేసేది. ఈ గ్రూప్ సమాచారాన్ని సేకరించి ఫౌజ్ ఉన్నత స్థాయి నాయకత్వానికి చేరవేసేది’ అని రొకాడే వివరించారు. కాలే ఫౌజ్ చివరి సైనికుడని ఆయన చెప్పారు. ఫౌజ్‌లో పనిచేసిన వారంతా ఇంతకు ముందే మృతి చెందారని ఆయన పేర్కొన్నారు. ఫౌజ్ ఓడిపోవడం, తరువాత 1947లో భారత్‌కు స్వాతంత్య్రం రావడంతో కాలే కొల్హాపూర్‌కు తిరిగి వచ్చి అక్కడే స్థిరపడ్డారు. దశాబ్దం క్రితం భార్య శ్యామల కన్నుమూసిన తరువాత కాలే ఆరోగ్యం బాగా క్షీణిస్తూ వచ్చిందని, గత ఏడేళ్లుగా ఆయన బాగోగులను తాము చూస్తూ వచ్చామని రొకాడే తెలిపారు. కాలే శాంతికాముకుడని ఆయన చెప్పారు.