జాతీయ వార్తలు

ఎన్‌హెచ్‌ఆర్‌సి పులిలా గర్జించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 21: దేశంలో మానవ హక్కులను పర్యవేక్షించే జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) మరిన్ని అధికారాలతో పులిలా గర్జించాల్సిన అవసరం ఉందని కమిషన్ చైర్‌పర్సన్, సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి హెచ్‌ఎల్.దత్తు ఉద్ఘాటించారు. ఎన్‌హెచ్‌ఆర్‌సి వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శుక్రవారం న్యూఢిల్లీలో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ, జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు మరిన్ని అధికారాలు కల్పించాలని తమతో పాటు ప్రతి ఒక్కరూ కోరుతున్నారని తెలిపారు. ఎన్‌హెచ్‌ఆర్‌సి ‘కోరలు లేని పులి’ మాదిరిగా తయారైందని, మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన కేసుల్లో తాత్కాలిక చర్యల విషయమై ఎన్‌హెచ్‌ఆర్‌సి జారీ చేస్తున్న ఆదేశాలు సమర్ధవంతంగా అమలు జరగాలంటే దీనికి మరిన్ని అధికారాలను కల్పించాల్సిన అవసరం ఉందని జస్టిస్ దత్తు స్పష్టం చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ‘మానవ హక్కులకు సంబంధించిన చాలా అంశాల్లో స్వయంగా జోక్యం చేసుకుని అనేక కేసులను పరిష్కరించిన ఎన్‌హెచ్‌ఆర్‌సి నేడు వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది. మున్ముందు మరిన్ని అధికారాలతో ఎన్‌హెచ్‌ఆర్‌సి పులిలా గర్జించాల్సిన అవసరం ఉంది’ అని ఆయన ఈ విలేఖర్ల సమావేశం సందర్భంగా పిటిఐ వార్తా సంస్థతో అన్నారు. 1993లో ఎన్‌హెచ్‌ఆర్‌సి ఆవిర్భవించిన నాటి నుంచి సుదీర్ఘ ప్రయాణంలో మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన ఎన్నో కేసులను పరిష్కరించడంతో పాటు మానవ హక్కులకు విఘాతం కలిగిస్తున్న చట్టాలపై ప్రభుత్వానికి కీలక సమాచారాన్ని అందజేస్తోందని జస్టిస్ దత్తు పేర్కొన్నారు.