జాతీయ వార్తలు

పశ్చిమ తీరానికి ఉగ్ర ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 21: ఆర్థికంగా శక్తివంతంగా ఉన్న పశ్చిమ తీర ప్రాంతానికి ఉగ్రవాద ముప్పు పొంచి ఉందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు.
దేశంలోని సుదీర్ఘ తీర ప్రాంతంలో పటిష్టమైన, లోపరహితమైన భద్రతను కల్పించాలంటే కేంద్రం,రాష్ట్రాల మధ్య సహకారం, సమన్వయం మరింతగా పెంపొందాల్సిన అవసరం ఉందన్నారు. శుక్రవారం ఇక్కడ జరిగిన పశ్చిమ జోనల్ మండలి 22వ సమావేశంలో మాట్లాడిన రాజ్‌నాథ్ ప్రస్తుత సవాళ్లమయ పరిస్థితుల్లో తీర ప్రాంత భద్రతను బలోపేతం చేయడానికి కేంద్రం అనేక చర్యలు తీసుకుంటోందన్నారు. ఇందులో భాగంగానే పోలీసుల బలగాలను ఆధునీకరిస్తున్నామన్నామని, అలాగే నిఘాను పెంపొందించడంతో పాటు ఆధునిక పరికరాలనూ సముపార్జించుకుంటున్నామని రాజ్‌నాథ్ వెల్లడించారు. ఇవన్నీ అనుకున్న ఫలితాలు ఇవ్వాలంటే కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయం ఎంతైనా అవసరమని, అప్పుడే దేశ సుదీర్ఘ తీర ప్రాంతం సురక్షితంగా ఉంటుందని తెలిపారు. కేంద్ర, రాష్ట్రాల మధ్యే కాకుండా రాష్ట్రాల మధ్య తలెత్తే అనేక సవాళ్లు, సమస్యలను పరిష్కరించడంలో జోనల్ కౌన్సిల్ సమావేశాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు.
సహకార సమాఖ్య భావనను బలోపేతం చేయడానికీ ఈ తరహా సమావేశాలు ఉపకరిస్తున్నాయన్నారు. 1972,2005 తర్వాత ఐదు జోనల్ కౌన్సిళ్ల మూడో సమావేశం 2015లోనే జరిగిందని రాజ్‌నాథ్ గుర్తు చేశారు. స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా చర్చించుకోవడానికి, పరస్పర సమస్యలను అర్థం చేసుకుని వాటిని సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవడానికి ఈ తరహా సమావేశాలు జరగాల్సిన అవసరం ఎంతో ఉందని తెలిపారు. ఈ రకమైన వేదికలను ఎంతగా విస్తృతం చేస్తే అంతగానూ కేంద్రంతో రాష్ట్రాలకు, రాష్ట్రాల మధ్య ఎలాంటి సమస్యలకు తావులేకుండా సమాఖ్య భావనను శక్తివంతంగా తీర్చిదిద్ద గలుగుతామని పేర్కొన్నారు. ఈ సలహా మండలులు కేంద్ర హోం మంత్రి అధ్యక్షతన పని చేస్తాయి. పశ్చిమ జోనల్ మండలిలో గోవా, గుజరాత్, మహారాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలైన డయ్యూ, డామన్‌లు, నాగర్ హవేలీలు ఉన్నాయి.

చిత్రం... పశ్చిమ జోనల్ కౌన్సిల్ సమావేశంలో మాట్లాడుతున్న
కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ , ఇరువైపులా మహారాష్ట్ర
సిఎం ఫడ్నవీస్ (ఎడమ), గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ