జాతీయ వార్తలు

6.54 కోట్ల మందికి బడి అంటేనే తెలియదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 31: గత దశాబ్ద కాలంలో అసలు స్కూలుకు వెళ్లనివారు, అలాగే మధ్యలో మానేసిన వారి సంఖ్య దాదాపు పదికోట్లకు పైనే ఉంది. 5-19 సంవత్సరాల మధ్య వయస్సుకలిగిన పిల్లల్లో 6.54 కోట్ల మంది అసలు బడి ముఖమే తెలియదని, అలాగే 4కోట్ల 49 లక్షల మంది మధ్యలోనే చదువులు మానేశారని 2011 జనగణన వివరాలను బట్టి స్పష్టమవుతోంది. 5-19 సంవత్సరాల వయస్సు కలిగిన వారు దేశంలో 38.01 కోట్ల మంది ఉన్నారు. వీరిలో 20.98 కోట్ల మంది అంటే 71 శాతం మంది పిల్లలు మాత్రమే స్కూళ్లకు వెళ్తున్నారు. అలాగే 11. 08 శాతం మంది అంటే 4.49 కోట్ల మంది మధ్యలోనే చదువులు స్వస్తిచెబుతున్నారని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదే వయస్సు వారిలో 65.7 లక్షల మంది దివ్వాంగులు ఉన్నారు.
వీరిలో 17.5 లక్షల మంది అంటే 21.7 శాతం మంది ఏనాడూ స్కూలు ముఖం చూడలేదు. అలాగే వీరిలో 8 లక్షల మంది మధ్యలోనే చదువుమానేశారని వివరాలు చెబుతున్నారు.