జాతీయ వార్తలు

ఢిల్లీలో గరిష్ఠ స్థాయికి వాయు కాలుష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 31: దీపావళి పండుగ వచ్చింది. కానీ వాతావరణంలో విషపూరితమైన గాలిని మిగిల్చి వెళ్లింది. ఇది ప్రతి సంవత్సరం జరిగేదే కదా అని చాలామంది అనుకోవచ్చు. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి దీపావళివల్ల దేశంలో, ప్రత్యేకించి రాజధాని ఢిల్లీలో కాలుష్యం సాధారణ స్థాయి కంటే 42 రెట్లు పెరగింది. హస్తినలో గాలి నాణ్యతపై ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (డిపిసిసి) ఆదివారం విడతల వారీగా సేకరించిన గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. స్థానిక ఆర్‌కె పురంలో ఆదివారం వాయు కాలుష్యం 42 పెరిగినట్లు పిఎం 10 రీడింగ్స్‌లో తేలిందని, రాత్రి 10 గంటల 55 నిమిషాలకు నమోదు చేసిన ఈ రీడింగ్స్‌లో క్యూబిక్ మీటర్‌కు 4,273 మైక్రాన్ల చొప్పున కాలుష్యం ఉన్నట్లు తేలిందని డిపిసిసి వెల్లడించింది. ఇదే ప్రాంతంలో మధ్యాహ్నం 2.30 గంటలకు నమోదు చేసిన పిఎం 2.5 రీడింగ్స్‌లో కాలుష్యం క్యూబిక్ మీటర్‌కు 748 మైక్రాన్లుగా ఉన్నట్లు తేలిందని ‘హిందుస్థాన్ టైమ్స్’ పత్రిక పేర్కొంది. పిఎం 2.5 రీడింగ్స్‌లో కాలుష్యం క్యూబిక్ మీటర్‌కు 60 మైక్రాన్లు, పిఎం 10 రీడింగ్స్‌లో 100 మైక్రాన్లు దాటితే ప్రజలకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే ఢిల్లీలో కాలుష్యం ఈ పరిమితుల కంటే ఎన్నో రెట్లు పెరిగి గాలిలో నాణ్యత గణనీయంగా తగ్గిపోవడం అందరికీ తీవ్రమైన ఆందోళన కలిగిస్తోంది.

ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో దీపావళి మరుసటి రోజు
(సోమవారం) కమ్ముకున్న దట్టమైన పొగ