జాతీయ వార్తలు

పిజి, ఎంఫిల్ కోర్సుల్లో యువతులే ఎక్కువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: దేశంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎం.్ఫల్ కోర్సులు చేస్తున్న వారిలో పురుషుల కన్నా స్ర్తిలే ఎక్కువ మంది ఉన్నారు. అయితే గ్రాడ్యుయేషన్‌లోపు కోర్సుల్లో, డిప్లొమా కోర్సుల్లో మాత్రం స్ర్తిలకన్నా పురుషులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఉన్నత విద్యపై నిర్వహించిన ఒక సర్వేలో ఈ విషయం వెల్లడయింది. అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి కోర్సుల్లో 53 శాతం మంది పురుషులు, 47 శాతం మంది స్ర్తిలు ఉన్నారని ఉన్నత విద్యపై అఖిల భారత సర్వే 2014-15లో తేలింది. అయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలో మాత్రం ఈ నిష్పత్తి మారిపోయింది. పిజి స్థాయి కోర్సులను చేస్తున్న వారిలో 51 శాతం మంది పురుషులు ఉండగా, 49 శాతం మంది స్ర్తిలు ఉన్నారు. పిహెచ్.డి చేయడానికి నమోదు చేసుకున్న వారిలో పురుషులే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.
వీరిలో 60 శాతం మంది పురుషులు ఉండగా, 40 శాతం మంది స్ర్తిలు ఉన్నారు. డొప్లొమా కోర్సులు చేస్తున్న వారిలో స్ర్తి, పురుషుల సంఖ్య వ్యత్యాసం భారీగా ఉంది. ఈ కోర్సుల్లో 72 శాతం మంది పురుషులు ఉండగా, కేవలం 28 శాతం మంది స్ర్తిలు ఉన్నారు.