జాతీయ వార్తలు

ఇంకొన్ని రోజులే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎటిఎం ఇబ్బందులు తొలగిపోతాయ
రెండు వారాల్లో రీకాలిబ్రేషన్ పూర్తి
రూ. 2 లక్షల కోట్లకు పైగా డిపాజిట్
పాత నోట్ల మార్పిడికి తొందర వద్దు
ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టీకరణ

న్యూఢిల్లీ, నవంబర్ 12: ఎటిఎంలలో నగదు తీసుకోవడానికి ఎదురవుతున్న ఇబ్బందులు మరికొన్ని రోజులు తప్పవని, ఎటిఎంల సాఫ్ట్‌వేర్‌ను పూర్తిగా మార్చడానికి మరో రెండు మూడువారాలు పడుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. కొత్తనోట్లకు అనుగుణంగా ఎటిఎంల సాఫ్ట్‌వేర్‌ను మార్చడానికి రెండు మూడువారాలు పడుతుందని అంటూ, ఇంత పెద్దఎత్తున జరిగే ప్రక్రియ రాత్రికి రాత్రే జరిగిపోదని స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో శనివారం బ్యాంకుల అధిపతులతో సమావేశమైన అనంతరం జైట్లీ మీడియాతో మాట్లాడారు. పాతనోట్ల స్థానంలో కొత్త నోట్లు తీసుకునేందుకు ప్రజలు పెద్దఎత్తున బ్యాంకులకు రావటం అత్యంత సహజమంటూ, పాత నోట్లను డిసెంబర్ 30 వరకు మార్చుకోవచ్చు కాబట్టి ప్రజలు తొందరపడవద్దని సూచించారు. పాతనోట్ల స్థానంలో కొత్తనోట్లను చేర్చటం అనేది చాలా పెద్ద పని కాబట్టి కొన్ని తప్పులు, కొంత జాప్యం జరగటం సహజమేనన్నారు. భారతీయ స్టేట్ బ్యాంకు దేశంలో జరిగే బ్యాంకింగ్ కార్యకలాపాల్లో దాదాపు 25 శాతం పని నిర్వహిస్తుందంటూ గురువారం నుండి శనివారం మధ్యాహ్నం వరకు ఎస్‌బిఐ రెండు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల బ్యాంక్ లావాదేవీలను నిర్వహించిందని జైట్లీ వెల్లడించారు. ఈ రోజు మధ్యాహ్నం వరకు ఈ బ్యాంకుల్లో 37 వేల 868 కోట్ల రూపాయలను డిపాజిట్ చేశారన్నారు. మొత్తంమీద దేశంలోని అన్ని బ్యాంకుల్లో దాదాపు రెండు లక్షల కోట్లకు పైగా డిపాజిట్ అయ్యాయని జైట్లీ తెలిపారు. ఎస్‌బిఐ ఈరోజు వరకు 58 లక్షలమందికి నోట్లు మార్చిందన్నారు. ఏటిఎంల సాఫ్ట్‌వేర్ మార్చాల్సి ఉన్నదని, అందుకే ఇవి పని చేయటంలో కొంత జాప్యం జరుగుతోందన్నారు. ఏటిఎంలను ముందే మార్చివేస్తే నోట్ల రద్దు గురించి తెలిసిపోయేదన్నారు. రెండు వారాల్లో ఏటిఎంల రీక్యాలిబ్రేషన్ పూర్తి అవుతుందన్నారు. పాత నోట్లు మార్చుకునేందుకు ప్రజలు పెద్దఎత్తున బ్యాంకులకు వస్తున్నందువల్లనే కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. రెవెన్యూ శాఖ కొందరిపై మాత్రమే దాడులు చేస్తోందనేది నిజం కాదన్నారు. నకిలీ నోట్లు, నల్ల ధనానికి సంబంధించిన విశ్వసనీయ సమాచారం ఉన్నప్పుడే రెవెన్యూ శాఖ దాడులు చేస్తోందని జైట్లీ స్పష్టం చేశారు. డబ్బు కొరత మూలంగా టోకు వ్యాపారం ఆగిపోతోందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. పన్ను చెల్లించని డబ్బు పెద్ద మొత్తంలో డిపాజిట్ జరిగితే దానిపై తప్పకుండా దర్యాప్తు జరుగుతుందని స్పష్టం చేశారు. బంగారం కొనుగోళ్లపై కూడా నిఘా వేసిపెట్టినట్లు ఆయన తెలిపారు. నల్లడబ్బుతోనే టోకు వ్యాపారం చేయాలనుకోవటం తప్పు అని జైట్లీ స్పష్టం చేశారు. కొత్త నోట్లలో డిజిటల్ లాకర్లు, ఎలక్ట్రానిక్ చిప్‌లను అమర్చినట్లు వస్తున్న వార్తలను ఆయన మరోసారి ఖండించారు.