జాతీయ వార్తలు

అసలు కంటే ముందే నకిలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిక్‌మగళూరు/ న్యూఢిల్లీ, నవంబర్ 12: మార్కెట్‌లోకి కొత్తగా ప్రవేశపెట్టిన రూ.2000 నోటు ఇంకా పూర్తిగా అందుబాటులోకి రానే లేదు.. అసలు నోటు కంటే ముందు నకిలీ నోటు మార్కెట్‌లోకి వచ్చేసింది. ఏ నల్లధనాన్నైతే అరికడతామని, ఏ నకిలీ కరెన్సీనైతే నిలిపేస్తామని మోదీ సర్కారు రాత్రికి రాత్రి విప్లవాత్మకచర్య తీసుకుందో.. ఆ చర్యకు తూట్లు పడ్డాయి. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలున్నట్లు చేతివాటం గాళ్లు రూ.2000 నోటుకు నకిలీని సృష్టించేశారు. కర్ణాటకలోని చిక్‌మగళూరులో ఈ నకిలీ నోటు బయటపడింది. స్థానిక ఏపిఎంసీ మార్కెట్‌లో ఓ కూరగాయల వ్యాపారికి ఎవరో ఒకరు రూ.2000 నోటు ఇచ్చి వెళ్లాడు. కొత్తగా విడుదల చేసిన నోటులో రంగులు ప్రత్యేకంగా ఉండటంతో అతను దాన్ని పరిశీలనగా చూస్తుండటంతో నోటు నలుమూలలు కత్తెరతో కత్తిరించినట్లు కనిపించింది. దీంతో అది నకిలీదని, కలర్ జిరాక్స్ తీసి, చక్కగా కత్తిరించి చలామణి చేసినట్లు రుజువైంది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మరోవైపు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ సైతం దొంగనోట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని భారత రిజర్వుబ్యాంకును హెచ్చరించారు. ఇందుకోసం ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నిఘా, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలను కూడా అప్రమత్తం చేయాలని ఆయన సూచించారు. ‘‘రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేయటం వెనుక ప్రధాన ఉద్దేశం దొంగనోట్లు, ఉగ్రవాదులకు నిధుల సరఫరా అడ్డుకోవటమే. అందువల్ల కొత్తగా విడుదల చేసిన నోట్లకు నకిలీ రాకుండా అరికట్టడం అత్యవసరం’’ అని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.

చిత్రం... చిక్‌మగళూరులో రెండువేల రూపాయల నకిలీ నోటును పరిశీలిస్తున్న పోలీసులు