జాతీయ వార్తలు

ఆరు నెలలుగా అతి రహస్యంగా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైసూరు, నవంబర్ 12: అక్రమార్కుల భరతం పట్టడానికి ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కొత్తగా 2000 రూపాయల నోటును తీసుకు వస్తున్నట్లు ఆయన అ నిర్ణయాన్ని ప్రకటించిన సమయంలో వెల్లడించారు కూడా. అయితే మోదీ ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు చాలా తతంగమే నడిచింది. అరు నెలలుగా కఠోర శ్రమ, అంతకు మించి ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచడం.. ఇలాంటి అనేక సంఘటనలు జరిగాయి. మోదీ నిర్ణయానికి అనుగుణంగా ఆరునెలల క్రితమే 2000 రూపాయల నోట్లను ముద్రించే పనిని ఆర్‌బిఐ చేపట్టింది. ఇంతకీ ఈ నోట్లను ముద్రించింది మైసూరులోని ప్రభుత్వ కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్‌లో. మైసూరులోని జనానికి పెద్దగా పరిచయం లేని విమానాశ్రయం ఈ నోట్ల రవాణాలో కీలకపాత్ర పోషించింది. మందాకల్లిలోని చిన్న విమానాశ్రయంనుంచి బయలుదేరిన చార్టర్డ్ విమానాలు కొత్తగా ముద్రించిన ఈ 2000 రూపాయలను అత్యంత రహస్యంగా దేశంలోని వివిధ నగరాల్లో ఉన్న ఆర్‌బిఐ కార్యాలయాలకు తరలించాయి. అక్కడ ఆ నోట్లను భద్రపరిచారు. పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు మోదీ నిర్ణయాన్ని ప్రకటించగానే వాటిని ఆయా నగరాల్లోని బ్యాంకులకు సరఫరా చేశారు. ప్రధాని ప్రకటన వెలువడిన వెంటనే కొత్త 2000 వేల నోట్లు చెలామణిలోకి రావడానికి ఇదే కారణం.
దాదాపు 20 ఏళ్ల నాటి మైసూరు కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్ ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్‌లలో ఒకటిగా గుర్తింపు పొందింది. మొట్టమొదట ప్రవేశపెట్టిన వెయ్యి రూపాయల నోటును కూడా ఇదే ప్రెస్‌లో ముద్రించారు. ఈ ప్రెస్ ఆవరణలోనే కరెన్సీ నోట్లను ముద్రించడానికి అవసరమైన పేపర్‌ను తయారు చేసే యూనిట్ కూడా ఉంది. అత్యంత హై సెక్యూరిటీ జోన్‌లో ఉండే ఈ ప్రింటింగ్ ప్రెస్‌కు ప్రత్యేక రైలుమార్గం, నీటి సరఫరా పైప్‌లైన్ లాంటి ఇతర సదుపాయాలు కూడా ఉన్నాయి.
ఇక మైసూరులోని విమానాశ్రయం విషయానికి వస్తే ఇది చాలా చిన్న విమానాశ్రయం. ఇక్కడ ఒకే ఒక రన్‌వే ఉంది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 83 కోట్ల రూపాయలతో ఈ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయగా, 2010లో అప్పటి కర్నాటక ముఖ్యమంత్రి యెడ్యూరప్ప దీన్ని ప్రారంభించారు. అయితే ఈ విమానాశ్రయం నిర్వహణలో భారీ నష్టాలు వస్తున్నట్లు ఎయిర్‌పోర్ట్ అథారిటీ తేల్చి చెప్పడంతో ఇక్కడినుంచి రెగ్యులర్ విమాన సర్వీసులు నిలిపివేశారు. ప్రస్తుతం ఇక్కడినుంచి చార్టర్డ్, విఐపి విమానాలు మాత్రమే నడుస్తున్నాయి.
2000 రూపాయల నోట్లను తరలించడం కోసం అద్దెకు తీసుకున్న చార్టర్డ్ విమాన ఆపరేటర్‌కు ప్రభుత్వం బెంగళూరు ఆర్‌బిఐ ఖాతానుంచి నగరంలోని ఎస్‌బిఐ శాఖకు దాదాపు రూ. 73,42,000 చెల్లించింది కూడా. చార్టర్డ్ విమానాలను కరెన్సీ నోట్లను నిర్దేశించిన నగరాలకు దగ్గర్లోని విమానాశ్రయాలకు తరలించగా, అక్కడినుంచి భారీ భద్రత నడుమ వాహనాలను ఆర్‌బిఐ శాఖలకు తరలించడం జరిగిందని ఈ మొత్తం వ్యవహారం గురించి తెలిసిన ఓ అధికారి చెప్పారు. అయితే ఆ అధికారి తన పేరు వెల్లడించడానికి మాత్రం ఇష్టపడలేదు.