జాతీయ వార్తలు

ఉగ్రవాదంపై పోరులో అన్ని దేశాలు ఒక్కటవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, నవంబర్ 12: ఉగ్రవాదం వల్ల ప్రపంచానికి ఎదురయిన పెను ముప్పును ఎదుర్కోవడానికి అన్ని దేశాలు సంఘటితం కావాలని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంఅద ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉగ్రవాదాన్ని అదుపు చేయడానికి ఎంతగానో దోహదపడుతుందని శనివారం ఇక్కడ ‘్భజ్‌పురి అధ్యాన్ శోధ్ సంస్థాన్’ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన చెప్పారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరయిన భోజ్‌పురి వాసులను ఆకట్టుకునే ఉద్దేశంతో ఆయన ‘న ఆతా చాహి, న తాతా చాహి, హహీకే పాకిస్తాన్‌మే సన్నతా చాహి’(పాకిస్తాన్‌లో ప్రశాంతత తప్ప మాకు ఏమీ అక్కర్లేదు) అని భోజ్‌పురిలో అన్నారు. భోజ్‌పురి భాషను రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో చేర్చే అంశం గురించి తాను ప్రధానమంత్రితో మాట్లాడానని, దానికి ఆయన అంగీకరించారని రాజ్‌నాథ్ చెప్పారు. భోజ్‌పురిని రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో చేర్చాలని పూర్వాంచల్ ప్రాంత వాసులు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. అనంతరం రాజ్‌నాథ్ విలేఖరులతో మాట్లాడుతూ 500, వెయ్యి రూపాయల నోట్ల రద్దును ఉగ్రవాదం, దాన్ని అదుపు చేయడంలో అది ఎంతగా పని చేస్తుందనే దృష్టితో చూడాలని అన్నారు. ఈ నిర్ణయం కారణంగా ఎక్కువగా ఇబ్బంది పడేది నకిలీ కరెన్సీ ద్వారా తమ ఉగ్రవాద కార్యకలాపాలను చాలావరకు సాగిస్తున్న పాకిస్తాన్, దాని ఇంటెలిజన్స్ ఏజన్సీయేనని రాజ్‌నాథ్ అన్నారు.