జాతీయ వార్తలు

నల్లధనం పేరుతో భారీ కుంభకోణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 12: పెద్ద నోట్ల రద్దు ‘పెద్ద కుంభకోణం’ అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించడానికి ముందే ఈ విషయాన్ని బిజెపి తన మిత్రులందరికీ తెలియజేసిందని ఆయన ఆరోపిస్తూ, పెద్ద నోట్ల రద్దును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేయాలన్న నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వం బ్లాక్ మార్కెటీర్లపై కాకుండా చిన్న మొత్తాలను పొదుపు చేసుకున్న సామాన్య ప్రజలపై ‘సర్జికల్ దాడి’కి పాల్పడిందని కేజ్రీవాల్ నిప్పులు చెరిగారు. పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి ప్రకటించడానికి కొన్ని రోజుల ముందే పంజాబ్ బిజెపి లీగల్ సెల్ నాయకుడు రూ.2 వేల నోట్లతో సామాజిక మాధ్యమాల్లో దర్శనమివ్వడం ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ‘జూలై నుంచి సెప్టెంబర్ వరకు బ్యాంకుల్లో డిపాజిట్లు అకస్మాత్తుగా పెరిగాయి. దీనిని బట్టి చూస్తే పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించడానికి ముందే ఈ విషయాన్ని బిజెపి తన మిత్రులందరికీ తెలియజేసినట్లు స్పష్టమవుతోంది. దీని వెనుక భారీ కుంభకోణం దాగి ఉంది’ అని కేజ్రీవాల్ శనివారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో అన్నారు. పెద్ద నోట్లను రద్దు చేసినంత మాత్రాన నల్లధనం బయటికి రాదని ఆయన పేర్కొన్నారు. అసలు నల్లధనం అంటే ఏమిటో నిర్వచనం ఇవ్వాలని, నల్లధనాన్ని కూడబెట్టిన వారిలో అంబానీ, అదానీ, శరద్ పవార్, సుభాష్ చంద్ర, బాదల్ లాంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఉన్నారో లేక రైతులు, రిక్షావాలాలు, చిరు వ్యాపారులు, కార్మికుల్లాంటి సామాన్య ప్రజలు ఉన్నారో ప్రధానితోపాటు బిజెపి అధ్యక్షుడు అమిత్ షా చెప్పాలని డిమాండ్ చేశారు.

దీటుగా స్పందించిన బిజెపి
కేజ్రీవాల్ ఆరోపణలపై బిజెపి తీవ్రంగా ప్రతిస్పందించింది. నల్లధనాన్ని కూడబెట్టిన వారిని కేజ్రీవాల్ వెనకేసుకొస్తున్నారని ధ్వజమెత్తింది. కేజ్రీవాల్ ఆరోపణలపై దర్యాప్తు జరిపించేందుకు ఎటువంటి ఆధారాలు లేవని, కనుక ఆ ఆరోపణలను సీరియస్‌గా తీసుకోవడం లేదని బిజెపి అధికార ప్రతినిధి జివిఎల్.నరసింహరావు తెలిపారు.

ఈ కామర్స్ కంపెనీలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ అయితే క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్లను మోదీ ప్రకటన రాగానే రద్దుచేసేశాయి. ప్రత్యామ్నాయ పథకాలు ప్రకటించాయి.