జాతీయ వార్తలు

ఆరోపణలన్నీ బాధ్యతా రాహిత్యం: జైట్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 12: పెద్ద నోట్ల రద్దు వెనక పెద్ద కుట్ర, కుంభకోణం ఉందంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలను జైట్లీ ఖండించారు. కొందరు రాజకీయ నాయకులు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ప్రజలు తమ డబ్బు తాము తీసుకునేందుకు క్యూలో నిలబడివలసిన అవసరం ఏమిటంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన ప్రశ్నను తిప్పికొట్టారు. ‘మీ డబ్బుకు పన్ను కట్టారా, లేదా అనేది తెసుకునే అధికారం దేశానికి ఉంది’ అని ఆయన శనివారం విలేఖరుల సమావేశంలో స్పష్టం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు ప్రధాని మోదీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం కొన్ని పార్టీలు, రాజకీయ నాయకులను కలవర పరుస్తోందని చెప్పారు. ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళన చేయటం కొందరికి నచ్చటం లేదని, అందుకే వారు గొడవ చేస్తున్నారని జైట్లీ ఎద్దేవా చేశారు. కొందరు నాయకులకు కొన్ని ప్రత్యేక సమస్యలున్నట్లు కనిపిస్తోందని విమర్శించారు. పెద్ద నోట్ల రద్దు సమాచారాన్ని కొందరికి ముందే తెలియజేశారంటూ వస్తున్న ఆరోపణలను కూడా జైట్లీ ఖండించారు. ఐదు వందలు, వెయ్యి రూపాయల నోట్లు రద్దు అవుతున్న విషయం ముందే తెలిసిపోయినందుకే గత జూలై నుండి సెప్టెంబర్ వరకు బ్యాంకుల్లో డిపాజిట్లు అధికంగా జరిగాయనే ఆరోపణలను కూడా ఆయన ఖండించారు. ఈ అంశంపై దర్యాప్తు జరిపించామని, పెరిగిన వేతనాలకు సంబంధించిన బకాయిలను బ్యాంకుల్లో డిపాజిట్ చేయటం వల్లనే ఇలాంటి అభిప్రాయం ఏర్పడిందని ఆయన వివరించారు. జూలై నుండి సెప్టెంబర్ వరకు బ్యాంకుల్లో పెరిగిన డిపాజిట్లకు సంబంధించిన పూర్తి వివరాలను అధ్యయనం చేయించామని ఆయన చెప్పారు. కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఉప్పు కొరత కూడా ఇలాంటి దుష్ప్రచారమేనని చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు తాము ప్రారంభించిన యజ్ఞం ఆగే ప్రసక్తే లేదని జైట్లీ స్పష్టం చేశారు.

మోదీ ట్విట్టర్ అకౌంట్ ఢమాల్!
న్యూఢిల్లీ, నవంబర్ 12: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ అకౌంట్‌పై తీవ్ర ప్రభావానే్న చూపింది. ఏకంగా 3,13,312 మంది ఫాలోవర్సును కోల్పోయారు. ప్రధాని మోదీ పెద్ద నోట్లు రద్దు ప్రకటన వెలువడిందో లేదో ట్విట్టర్ అకౌంట్‌కు ఆదరణ తగ్గిపోవడం మొదలైంది. నిత్యం నెటిజన్లతో రద్దీగా ఉండే మోదీ ట్విట్టర్ అకౌంట్ ఒక్కసారి ఖాతాదారులను కోల్పోయింది. రోజుకు సగటున ఆయన ట్విట్టర్‌కు 4.3 లక్షల మంది ఫాలోవర్స్ ఉంటారు. కొత్త ఖాతాదారులు ఇరవై నుంచి ఇరవైనాలుగు వేల మంది నెటిజన్లు వచ్చి చేరుతుంటారు. అలాంటిది పెద్దనోట్ల రద్దు ప్రకటన తరువాత బుధవారం నుంచి ఫాలోవర్స్ తగ్గిపోయారు.