జాతీయ వార్తలు

నోట్ల రద్దు.. రాజకీయ జిమ్మిక్కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/ కోల్‌కతా, లక్నో/ తిరువనంతపురం/ ముంబయి, నవంబర్ 12: ప్రధాని నరేంద్ర మోదీ నల్ల ధనాన్ని నియంత్రించడానికి పెద్దనోట్ల చలామణిని రద్దు చేయలేదని, రాజకీయ ప్రయోజనాల కోసం ఆడిన జిమ్మిక్కే ఈ చర్య అని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. మోదీకి నిజంగా నల్లధనాన్ని, అవినీతిని నిర్మూలించాలనే చిత్తశుద్ధి ఉంటే ఉత్తరప్రదేశ్, పంజాబ్ తదితర రాష్ట్రాలలో త్వరలో జరుగనున్న ఎన్నికల్లో బిజెపి చేసే ఎన్నికల వ్యయాన్ని ఆ పార్టీ బహిర్గతం చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. 2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బిజెపి చేసిన వ్యయంపై దర్యాప్తు జరపడానికి ఒక ఇంక్వైరి కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ఆ పార్టీని కాంగ్రెస్ అధికార ప్రతినిధి కపిల్ సిబల్ డిమాండ్ చేశారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి పెద్ద మొత్తంలో నల్ల ధనాన్ని ఖర్చు చేసిందని ఆయన ఆరోపించారు. అకస్మాత్తుగా పెద్ద నోట్లను రద్దుచేయడం వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ప్రధాని మోదీ ఇక్కడ అందుబాటులో లేకుండా విదేశాలకు ఎందుకు వెళ్లారని సిబల్ ప్రశ్నించారు. సరయిన ప్రణాళిక లేకుండా తీసుకున్న తొందరపాటు నిర్ణయం వల్ల ప్రజలు తీవ్ర కష్టాలు పడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్ సహా ఎక్కడ ఎన్నికలు జరిగినా బిజెపి నిర్వహించే ప్రతి సభకోసం వ్యయం ఖాతాను నిర్వహించాలని, టెంట్లు, పోస్టర్లు, వాటర్ ట్యాంకులు మొదలగు వాటికి చెక్కుల రూపంలో చెల్లింపులు చేయాలని, ఆ చెక్కులను ఎవరు, ఎవరికి ఇచ్చారు తదితర వివరాలన్నింటిని బిజెపి వెబ్‌సైట్‌లో పొందుపరచాలని సిబల్ డిమాండ్ చేశారు. ఈ పని చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇవ్వాలని అన్నారు. ఇలా చేస్తేనే మోదీకి నిజంగా నల్లధనం, అవినీతి నిర్మూలన పట్ల చిత్తశుద్ధి ఉన్నట్టు, నోట్ల రద్దు రాజకీయ జిమ్మిక్కు కాదని భావించటం జరుగుతుందని సిబల్ తేల్చి చెప్పారు. 2005కు ముందు పెద్ద నోట్ల రద్దు గురించి అప్పటి యుపిఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని భావిస్తుండగా, ఆ అంశాన్ని 2014 జనవరిలో బిజెపి వ్యతిరేకించిందని సిబల్ పేర్కొన్నారు.
అది ‘నల్ల’ రాజకీయ నిర్ణయం: మమత
పెద్ద నోట్ల రద్దును ప్రధాని మోదీ తీసుకున్న ‘నల్ల’ రాజకీయ నిర్ణయంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభివర్ణించారు. సామాన్య ప్రజలకు వ్యతిరేకమైన ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆమె శనివారం ట్విట్టర్ సందేశంలో డిమాండ్ చేశారు. మోదీ నిర్ణయం మనీలాండర్లకు అనుకూలంగా పెద్ద కుంభకోణంగా పరిణమించిందని ఆమె ఆరోపించారు. కేంద్రం అనుసరిస్తున్న పేదల వ్యతిరేక నిర్ణయాలకు నిరసనగా కలిసి పనిచేయడానికి ముందుకు రావాలని ఆమె అన్ని ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు.
నల్లధనాన్ని నిర్మూలించదు: అఖిలేష్
పెద్ద నోట్ల రద్దు దేశంలో నల్లధనాన్ని నిర్మూలించడానికి ఏమాత్రం ఉపయోగపడదని ఉత్తరప్రదేశ్ సిఎం అఖిలేష్ యాదవ్ అన్నారు. ప్రజల చైతన్యంతోనే అవినీతి నిర్మూలన సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.
వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే..
నల్లధనాన్ని నియంత్రించడంలో విఫలమైన ప్రధాని మోదీ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి పెద్ద నోట్లను రద్దు చేశారని సిపిఐ కేరళ రాష్ట్ర శాఖ మండిపడింది. ఈ నోట్ల రద్దు నల్లధనాన్ని నియంత్రించదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కనం రాజేంద్రన్ శనివారం ఇక్కడ ‘మీట్ ది ప్రెస్’లో పేర్కొన్నారు.
శివసేనా బాధ్యత వహించాల్సిందే: చవాన్
పెద్ద నోట్ల రద్దును శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే విమర్శించడంపై కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర అధ్యక్షుడు అశోక్ చవాన్ మండిపడ్డారు. సామాన్య ప్రజలు

పెద్దనోట్ల రద్దుకు నిరసనగా శనివారం అహ్మదాబాద్‌లోని రిజర్వు బ్యాంకు కార్యాలయం వెలుపల ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలుపడుతున్న ఇబ్బందులకు ఉద్ధవ్ థాకరే కూడా బాధ్యుడేనని చవాన్ శనివారం ముంబయిలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పేర్కొన్నారు.