జాతీయ వార్తలు

24 వరకూ చెల్లుతాయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 14: ప్రభుత్వ ఆసుపత్రులు, పెట్రోల్‌బంకులు టోల్‌బూత్‌లలో రద్దయిన 500, 1000 నోట్లను అనుమతించనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ సోమవారం వెల్లడించింది. అలాగే, దేశంలోని అన్ని హైవేలపై ఈనెల 18 అర్థరాత్రి వరకు టోల్‌టాక్స్ రద్దుచేసింది.
ప్రభుత్వం, ప్రవేటు మందుల షాపులు, విద్యుత్, నీటి బిల్లలు, రైల్వే టికెట్ కౌంటర్లు, ప్రయాణికుల కేటరింగ్‌కు పెద్దనోట్లు చెల్లుతాయని స్పష్టం చేసింది. అలాగే టోల్‌టాక్స్‌ను ఈనెల 18 అర్థరాత్రి వరకూ రద్దుచేశారు. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శశికాంత దాస్ ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీని ఆయన నివాసంలో కలిసి పెద్దనోట్ల రద్దు, తదనంతర పరిణామాలపై చర్చించారు. పలువురు సీనియర్ మంత్రులు సమావేశానికి హాజరయ్యారు. పాత నోట్ల మార్పిడి, ఎటిఎంలలో విత్‌డ్రా విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని శశికాంత దాస్ స్పష్టం చేశారు. ఇదిలావుంటే, ‘టోల్‌టాక్స్ రద్దు గడువును మరో నాలుగురోజులు పొడిగించింది. శుక్రవారం అర్థరాత్రి వరకూ టోల్‌ఫీజు వసూలు చేయరు’ అని ఓ అన్నతాధికారి వెల్లడించారు. నగదు రవాణాకు సంబంధించి ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నట్టు వారు తెలిపారు. పెద్దనోట్లు రద్దు చేసిన నేపథ్యంలో ఏటిఎంలలో నగదు నింపడానికి, మారుమూల బ్యాంకులకు నగదు సకాలంలో చేర్చాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అవినీతి, నల్లధనాన్ని కట్టడి చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం 500,1000 రూపాయల నోట్లు రద్దుచేశారు. తొలుత టోల్‌ప్లాజాల వద్ద రద్దీని నివారించేందుకు 11 వరకూ టోల్‌గేట్ ఫీజు రద్దుచేశారు. మళ్లీ గడువును సోమవారం అర్థరాత్రి వరకూ పొడిగించారు. దాన్ని మరోసారి ఈనెల 18 అర్థరాత్రి వరకూ పొడిగించినట్టు అధికారి తెలిపారు.‘మొత్తం పరిస్థితిని సమీక్షించిన తరువాతే టోల్‌గేట్ ఫీజు గడువుపెంచాలని నిర్ణయించాం’ అని కేంద్ర రవాణా, హైవేల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. టోల్‌గేట్ ఫీజులు రద్దువల్ల తలెత్తే నష్టాన్ని ప్రభుత్వమే భరిస్తుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.