జాతీయ వార్తలు

భూమార్పిడికి కేంద్రం ఓకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 30: విశాఖపట్నం విమానాశ్రయం దగ్గర ఉన్న భారత ఎయిర్‌పోర్ట్ అథారిటీకి చెందిన భూమికి బదులు విశాఖ పోర్ట్ ట్రస్‌కు చెందిన భూమిని తీసుకునేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు ఒక నిర్ణయం తీసుకున్నారు. కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విశాఖపట్నం విమానాశ్రయం వద్ద ఉన్న 11.45 ఎకరాల భూమిలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్‌ను నిర్మించనున్నది. విశాఖపట్నం విమానాశ్రయం వద్ద ఉన్న ఈ భూమిని తీసుకున్నందుకు బదులుగా విశాఖపోర్ట్ ట్రస్ట్‌కు చెందిన 11.45 ఎకరాల భూమిని భారత ఎయిర్‌పోర్ట్ అథారిటీకి ఇస్తారు. ఈ భూమిని ఇచ్చిపుచ్చుకోవటం వలన భారత ఎయిర్ పోర్ట్ అథారిటీకి, విశాఖ పోర్ట్ ట్రస్ట్‌కు ప్రయోజనం కలుగుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. విశాఖ పోర్ట్ ట్రస్ట్ ఇస్తున్న 11.45 ఎకరాల భూమి భారత ఎయిర్ పోర్ట్ అథారిటీ భూమికి ఆనుకుని ఉన్నందున భవిష్యత్తులో విశాఖపట్నం విమానాశ్రయం విస్తరణకు వీలు కలుగుతుంది. ఇదే విధంగా భారత కంటైనర్ కార్పొరేషన్ మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కును ఏర్పాటు చేయటం వలన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మరింత పుంజుకుంటుంది. మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కును ఏర్పాటు చేయటం వలన కార్గో హాండ్లింగ్ సామర్థ్యం పెరుగుతుంది. అలాగే ఇంటిగ్రేటెడ్ రైల్, రోడ్ లాజిస్టిక్ హబ్ అభివృద్ధికి వీలుకలుగుతుంది. తద్వారా ఆర్థిక లావాదేవీలు పెరగటంతో పాటు రాష్ట్రంలో వాణిజ్యాభివృద్దికి వీలుకలుగుతుంది. రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని పబ్లిక్ సెక్టార్ రంగానికి చెందిన భారత కంటైనర్ కార్పొరేషన్ విశాఖపట్నంలో 98 ఎకరాల్లో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్‌ను ఏర్పాటు చేస్తోంది. నౌకాయాన మంత్రిత్వ శాఖ పరిధిలోని విశాఖ పోర్ట్ ట్రస్ట్ 98 ఎకరాల భూమిని లీజు కింద భారత కంటైనర్ కార్పొరేషన్‌కు ఇచ్చింది.