జాతీయ వార్తలు

వెనక్కి తగ్గను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 14: పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని మార్చుకునే ప్రసక్తే లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం బిజెపి కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ అవినీతిపరులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రకటించారు. బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, సీనియర్ నాయకుడు లాల్ కృష్ణ అద్వానీ, హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, సమాచార మంత్రి ఎం వెంకయ్యనాయుడు తదితర సీనియర్ నాయకులు సమావేశానికి హాజరయ్యారు. పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని దేశ ప్రజలంతా సమర్థిస్తున్నారని, నల్లధనంపై ప్రభుత్వం చేస్తున్న యుద్ధం వెనక వారూ ఉన్నారన్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఉపసంహరించాలంటూ విపక్షాలు తెస్తున్న వొత్తిడికి లొంగకూడదని ఆయన బిజెపి నాయకులకు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎలాంటి పరిస్థితిలోనూ పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోదన్నారు. నోట్ల రద్దు కారణంగా దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు మోదీ వెల్లడించారు. సమస్యలన్నీ కొన్ని రోజుల్లోనే పరిష్కారం అవుతాయని భరోసానిచ్చారు. ఇదిలావుంటే బిజెపి అధ్యక్షుడు అమిత్ షా మాట్లాడుతూ పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో విపక్షాలను ఎదుర్కొనేందుకు పార్టీ అనుసరించే వ్యూహాన్ని వివరించారు. పెద్ద నోట్ల రద్దుపై ప్రతిపక్షం అడిగే ప్రశ్నకు సమాధానం ఇచ్చేబదులు, విపక్షాలపై ఎదురుదాడికి దిగాల్సిందిగా పార్టీ ఎంపీలకు సూచించినట్టు అమిత్ షా నేతలకు వివరించారు. ఓఆర్‌ఓపి, ఆక్రమిత కాశ్మీర్‌పై సైన్యం మెరుపుదాడి, పెద్ద నోట్ల రద్దుతో నల్లధనాన్ని ఘాజీపూర్‌లో సోమవారం బిజెపి నిర్వహించిన పరివర్తన్ ర్యాలీ సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ అదుపు చేయటం తదితర అంశాలపై విపక్షాలను నిలదీయాలని అమిత్ షా తమ ఎంపీలకు సుచించారు. పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని బిజెపి పార్లమెంటరీ పార్టీ పూర్తిగా సమర్థించిందని సమాచార మంత్రి ఎం వెంకయ్యనాయుడు తెలిపారు. బిజెపితోపాటు మిత్రపక్షాలు పూర్తిస్థాయిలో నరేంద్ర మోదీ నిర్ణయాలను బలపర్చటంతోపాటు
పూర్తి మద్దతు ఇస్తున్నాయని ఆయన చెప్పారు. పెద్ద నోట్ల రద్దు వ్యవహారాన్ని విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్ తదితర ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసమే పెద్ద నోట్లను రద్దు చేశారంటూ విపక్షం చేస్తున్న ఆరోపణలను వెంకయ్య తీవ్రంగా ఖండించారు.