జాతీయ వార్తలు

నిద్రలేని నల్ల కుబేరులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘాజీపూర్, నవంబర్ 14:పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల పేదలు సుఖంగా నిద్ర పోతున్నారని, నల్లకుబేరులే నిద్ర పట్టక నిద్ర మాత్రల కోసం పరుగులు పెడుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 1000, 500 కరెన్సీ నోట్ల చెలామణిని రద్దు చేయడంపై విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలపై నరేంద్ర మోదీ విమర్శలు, చతురోక్తులతో విరుచుకు పడ్డారు. సమాజంలో వేళ్లూనుకు పోయిన అవినీతిని, నల్లధనాన్ని రూపుమాపే లక్ష్యంతో తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కలిగే అసౌకర్యాన్ని కొంత కాలం భరించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. గోవా, కర్నాటకలోని బెలగావిల్లో ఆదివారం చేసిన ఉద్వేగ భరిత ప్రసంగానికి కొనసాగింపుగా సోమవారం ఇక్కడ జరిగిన పరివర్తన ర్యాలీలో మాట్లాడిన మోదీ తన చర్యను ఘాటైన వాసన వచ్చే సున్నం వేయడంగా సరిపోల్చారు. నల్లధనాన్ని, అవినీతిని నిర్మూలించేందుకు ‘ఈ వైట్‌వాష్’తప్పలేదన్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం కఠినమైనదేనని స్పష్టం చేసిన మోదీ ‘నేను టీ అమ్మేటప్పుడు కడక్ ఛాయ్ (డికాక్షన్ ఎక్కువ) అడిగేవారు. కానీ ఇది ధనికుల మనసు వికలం చేస్తుంది’అని అన్నారు. కేంద్రం నిర్ణయంతో సామాన్య ప్రజలు నానా అవస్థలు పడుతున్నారంటూ కాంగ్రెస్ చేస్తున్న విమర్శల్ని గట్టిగా తిప్పికొట్టారు. ఎమర్జెన్సీతో కాంగ్రెస్ పార్టీ ప్రజల హక్కుల్ని హరించిందని, పావలా నాణేలనూ రద్దు చేసిందని గుర్తు చేశారు. ఏ చట్టం కింద అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పావలా నాణేన్ని రద్దు చేసిందని ప్రశ్నించిన మోదీ ‘కాంగ్రెస్ పార్టీ పావలా రద్దు నిర్ణయానికి మించి వెళ్లలేక పోయింది. దాని స్థాయిని బట్టి అప్పటి ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. మా స్థాయిని బట్టి మేము ఈ నిర్ణయం తీసుకున్నాం’అని స్పష్టం చేశారు. నెహ్రూ జయంతి రోజునే తాను యూపీ వచ్చి పలు ప్రాజెక్టులను చేపడుతున్నానని, ప్రజలందరూ సమగ్రంగా వికాసం చెందాలన్న నెహ్రూ కలలను సాకారం చేయడానికి ఇంతకు మించిన నివాళి మరొకటి లేదన్నారు. యూపీలోని వారణాసి లోక్‌సభ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తాను ఇప్పటి వరకూ యూపీకి చెందిన ఏ ఎంపీ చేయని రీతిలో నెహ్రూకు నివాళులర్పిస్తున్నానని, ఆయన కలలను సాకారం చేస్తున్నానని మోదీ తెలిపారు. దేశ ప్రజలను విపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని ధ్వజమెత్తిన మోదీ దేశంలో అవినీతిని, నీతిబాహ్యతను సహించాలా అంటూ ప్రజల్ని ప్రశ్నించారు. ఎమర్జెన్సీ కాలంలో 19నెలల పాటు దేశాన్ని జైలుగా మార్చిన కాంగ్రెస్ పార్టీకి తన నిర్ణయాన్ని తప్పుబట్టే హక్కు, అధికారం లేదన్నారు. అలహాబాద్ హైకోర్టు తీర్పు నేపథ్యంలో తన పదవిని కాపాడుకునేందుకే అప్పటి ప్రధాని ఇందిర దేశంలో ఎమర్జెన్సీ విధించారని, అది పేదలను ఉద్దేశించే ఉద్దేశంతో కాదని మోదీ అన్నారు. దేశంలో అభివృద్ధికి నిధుల కొరత లేదని పేర్కొన్న మోదీ డబ్బు వెళ్లాల్సిన చోటకి వెళ్లక పోవడం వల్లే సమస్య తలెత్తిందన్నారు. తమ వద్ద ఉన్న డబ్బుతో ఏ పనైనా చేయగలిగిన వారిపైనే తన పోరాటాన్ని మొదలు పెట్టానని, పేదలు, రైతులు, గ్రామస్తుల కోసం ఈ పోరాటాన్ని కొనసాగిస్తానని ఉద్ఘాటించారు. ప్రభుత్వాల్ని కొనేసే, కూలదోసే శక్తి కలిగిన వారికి తాను భయపడాల్సిన అవసరం ఉందా అని కూడా ప్రజల్ని ప్రశ్నించారు.
chitram....
యుపిలోని ఘాజీపూర్‌లో బిజెపి నిర్వహించిన పరివర్తన్ ర్యాలీ సభలో మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ

రేపు భివాండీ
కోర్టుకు రాహుల్
ముంబయి, నవంబర్ 14: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తనపై దాఖలైన పరువునష్టం కేసుకు సంబంధించి బుధవారం భీవాండీ కోర్టుకు హాజరుకానున్నారు. మహాత్మాగాంధీ హత్యకు ఆర్‌ఎస్‌ఎస్‌కే కారణమంటూ 2014 ఎన్నికల సభలో రాహుల్ ఆరోపించారు. దీనిపై స్థానిక ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త రాహుల్‌పై పరువునష్టం కేసు వేశారు. రాహుల్‌గాంధీ మంగళవారం సాయంత్రం నగరానికి చేరుకుని, బుధవారం ఉదయం థానే జిల్లాలోని భివాండీ కోర్టుకు హాజరవుతారు. రాహుల్ గాంధీకి ముంబయి విమానాశ్రయంలో కార్యకర్తలు ఘనస్వాగతం పలుకుతారని ముంబయి నగర కాంగ్రెస్ అధ్యక్షుడు సంజయ్ నిరుపం వెల్లడించారు.

2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ముంబయి శివార్లలో జరిగిన ఓ ఎన్నికల సభలో మాట్లాడిన రాహుల్‌గాంధీ ఆర్‌ఎస్‌ఎస్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు.