జాతీయ వార్తలు

మోదీ ప్రపంచ నాయకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,నవంబర్ 16: దేశంలోని అవినీతి, నల్లధనాన్ని అరికట్టటంతోపాటు ఉగ్రవాదాన్ని దెబ్బ తీసేందుకు పెద్ద నోట్లను రద్దు చేయటం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ నాయకుడుగా ఎదిగిపోయారని కేంద్ర సమాచార శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ప్రశంసలు కురిపించారు. ఎవరి మెప్పుకోసమో తాను ఈ మాటలు అనడం లేదని ప్రపంచ నేతలంతా ఆయన తీసుకున్న చర్యను ప్రశంసిస్తున్నారన్నారు. దేశంలో మార్పు తెచ్చేందుకు మోదీ చేస్తున్న ప్రయత్నాలకు ప్రతిపక్షం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం రాజ్యసభలో పెద్ద నోట్ల రద్దు అంశంపై జరిగిన చర్చలో వెంకయ్య పాల్గొంటూ, 2014 ఎన్నికలు అవినీతి,కుంభకోణాలు తదితర అంశాల ఆధారంగా జరిగాయని, అవినీతి, నల్లధనాన్ని అరికడతామని హామీ ఇచ్చినందుకే ప్రజలు తమను అధికారంలోకి తెచ్చారని స్పష్టం చేశారు. అవినీతి, నల్లధనం ప్రాథమిక హక్కుగా అభివర్ణిస్తున్నారంటూ ఆయన ప్రతిపక్షంపై ఆరోపణలు కురిపించారు. దేశ ప్రజలకు నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విశ్వాసం కలుగుతోందని, పెద్దనోట్ల రద్దు వలన ఇబ్బందులు ఎదురవుతున్నా ప్రజలంతా మోదీ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారన్నారు. నోట్ల రద్దు అకస్మాత్తుగా జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపించటం ఏమిటి? అందరికీ చెప్పి చేయాలా? అని ఆయన నిలదీశారు.
పెద్ద నోట్ల రద్దు, దేశంలో మార్పు తీసుకురావటాన్ని వెంకయ్యనాయుడు ప్రసవంతో పోలుస్తూ ప్రసవం సమయంలో తీవ్రమైన బాధ కలిగినా సంతానం కలిగిన తరువాత మహదానందంలో పడిపోతారని, నోట్ల రద్దు కూడా అలాంటిదేనని, మొదట కొంత కష్టమైనా ఆ తరువాత ఎంతో ఆనందం కలుగుతుందని చెప్పారు. తప్పుడు ఆరోపణలతో ప్రజల దృష్టిని మళ్లించటం ద్వారా పెద్దనోట్ల రద్దు లక్ష్యాన్ని దెబ్బ తీసేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని దుయ్యబట్టారు. నోట్ల రద్దు గురించి కొందరికి ముందే లీక్ చేశారనే ఆరోపణను ఆయన తిప్పికొట్టారు. ఈ ఆరోపణలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు.
దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అవినీతి, నల్లధనాన్ని అదుపు చేసేందుకే పెద్ద నోట్లను రద్దు చేశారని ఆయన వాదించారు. దేశాన్ని సమూలంగా మార్చేందుకు మోదీ కంకణం కట్టుకున్నారని, ఎవరు ఏం చెప్పినా అవినీతి,నల్లధనంపై దాడి కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఉప్పు కొరత, పప్పుకొరత అంటూ ఎవరెన్ని తప్పుడు ప్రచారాలు చేసినా భయపడేది లేదన్నారు. తప్పుడు వదంతులను ప్రచారం చేయటం ద్వారా మోదీ ప్రారంభించిన య జ్ఞాన్ని దెబ్బ తీసేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని వెంకయ్యనాయుడు దుయ్యబట్టారు. ఈ దశలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ జోక్యం చేసుకుని వెంకయ్యనాయుడు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.