జాతీయ వార్తలు

డ్యూటీ చేయలేక..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూణె, నవంబర్ 16: పెద్ద నోట్ల రద్దు బ్యాంకు ఉద్యోగులపై తీవ్రమైన ఒత్తిడిని పెంచుతోంది. సెలవులు లేక.. సాధారణ పనివేళలకు మించి రేయింబవళ్లు పనిచేయటంతో సీనియర్ ఉద్యోగులు తాళలేకపోతున్నారు. పూణె సమీపంలోని రాజ్‌గురునగర్ స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచిలో మెసెంజర్‌గా పనిచేస్తున్న తుకారాం తాన్పురె బుధవారం ఒత్తిడి తట్టుకోలేక బ్యాంకులోనే కుప్పకూలాడు. ఆయన్ని ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు. ఉదయం నుంచి తమ బ్రాంచిలో పెద్ద ఎత్తున ప్రజలు బారులు తీరారని, మధ్యాహ్నం 1.30 గంటలకు తాన్పురే ఒక్కసారిగా పడిపోవటంతో ఆసుపత్రికి తరలించామని, కానీ, ఆయన్ని కాపాడుకోలేకపోయామని బ్రాంచి మేనేజర్ శ్రీ్ధర్ అయ్యర్ తెలిపారు. ఆయన మృతికి పూర్తి కారణాలు పోస్ట్‌మార్టమ్‌లో తేలుతాయని పోలీసులు పేర్కొన్నారు.