జాతీయ వార్తలు

జన్.. ధనాధన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 23:పెద్ద నోట్ల రద్దుతో జన్‌ధన్ ఖాతాల్లో నిధుల పంట పండింది. కేవలం 13రోజుల వ్యవధిలో ఈ ఖాతాల్లోకి అనూహ్య రీతిలో 21వేల కోట్ల రూపాయల మేర డిపాజిట్లు వచ్చాయని అధికార వర్గాలు బుధవారం తెలిపాయి. గత రెండు వారాలుగా ఈ ఖాతాల్లోకి డిపాజిట్లు పోటెత్తాయని..వీటిలో మమతా బెనర్జీ సారధ్యంలోని పశ్చిమ బెంగాల్ మొదటిస్థానంలో కాంగ్రెస్ సారథ్యంలోని కర్నాటక రెండోస్థానంలో ఉందని వెల్లడించాయి. ఈ నెల 8న 500,1000 నోట్లను కేంద్రం రద్దు సమయానికి 25.5కోట్ల జన్‌ధన్ ఖాతాల్లో ఉన్న మొత్తం 45,635.61కోట్ల రూపాయలు. తాజా లెక్కల ప్రకారం కేవలం రెండువారాల వ్యవధిలో ఈ మొత్తం 66,636కోట్ల రూపాయలకు చేరుకుందని అధికారులు వివరించారు. ఎలాంటి బ్యాలెన్స్ ఉండాల్సిన నిబంధన లేని ఈ ఖాతాల్లోకి ఇంత భారీ మొత్తం ఎలా జమ అయిందన్నది విస్మయాన్ని కలిగిస్తోందని అధికారులు తెలిపారు.