జాతీయ వార్తలు

పెద్ద నోట్ల రద్దుపై గందరగోళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 23: పెద్దనోటు రద్దుపై పార్లమెంట్ బుధవారం కూడా దద్దరిల్లింది. విపక్షాల నిరసనలు, అరుపులు, నినాదాలు, వ్యంగ్య కూత లు, హాహాకారాలు ఉభయ సభల్లో వినిపించాయి. లోక్‌సభలో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాల సభ్యులు పోడియంను చుట్టుముట్టి ‘ఓ ఓ’ అంటూ సభ దద్దరిల్లేలా భయంకరంగా అరుస్తూ కార్యక్రమాలకు అడ్డుతగిలారు. పెద్ద నోట్ల రద్దు, సామాన్యుల ఇబ్బందులపై తామిచ్చిన వాయిదా తీర్మానాన్ని చర్చకు చేపట్టేంతవరకూ సభను సాగనిచ్చేది లేదని ప్రతిపక్షాలు లోక్‌సభలో ప్రకటించాయి. ప్రధాని మోదీ సభకు హాజరై చర్చకు సమాధానం ఇచ్చే వరకూ సభను సాగనిచ్చేది లేదని రాజ్యసభలో విపక్షాలు ప్రకటించాయి. సభ్యుల చర్యలపై స్పీకర్ సుమిత్రా మహాజన్, రాజ్యసభ ఉపాధ్యక్షుడు పిజె కురియన్ పలుమార్లు మండిపడ్డారు. విపక్షాలు కూతలతో రెచ్చిపోతున్నపుడు ప్రధాని మోదీ లోక్‌సభలో ఉండటం గమనార్హం. చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం, వాయిదా తీర్మానంపై చర్చ జరపాలని విపక్షాలు అదే ధోరణి ప్రదర్శించారు. కాంగ్రెస్ పక్షం నాయకుడు మల్లిఖార్జున ఖర్గే వాయిదా తీర్మానంపై చర్చకు పట్టుబట్టారు. చర్చ జరిగినంత సేపూ ప్రధాని సభలో ఉండాలని షరతు పెట్టారు. దీంతో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఏదో ఒక నియమం ఆధారం చర్చ జరపాలని తెరాస పక్షం నాయకుడు జితేందర్ రెడ్డి, బిజెపి ఎంపీ బర్తృహరి మహతాబ్ విజ్ఞప్తి చేశారు. అయితే మిగతా ప్రతిపక్షాలు మాత్రం 56 నియమం ప్రకారమే చర్చ జరగాలని స్పష్టం చేయడంతో సభా కార్యక్రమాలు స్థంభించాయి. దీంతో సభను గురువారానికి వాయిదా వేస్తూ స్పీకర్ మహాజన్ వెళ్లిపోయారు.
ప్రధాని సభకు రారా
ప్రధాని నరేంద్ర మోదీ సభకు ఎందుకు రావటం లేదని రాజ్యసభలో ప్రతిపక్షం నాయకులు ఎన్డీయే సర్కారును నిలదీశారు. సిపిఎం పక్షం నాయకుడు సీతారాం ఏచూరి, బిఎస్పీ అధినేత్రి మాయావతి, కాంగ్రెస్‌పక్షం నాయకుడు గులాం నబీ ఆజాద్, జెడి(యు) పక్షం నాయకుడు శరద్ యాదవ్ తదితరులు మాట్లాడుతూ నరేంద్ర మోదీ సభకు ఎందుకు రావటం లేదని ప్రశ్నించారు. ప్రధాని సభకు రావాల్సిందిగా రూలింగ్ ఇవ్వాలని కురియన్‌ను కోరారు. తానలా చేయలేనని కురియన్ చెప్పినా ప్రతిపక్షం పట్టించుకోలేదు. ప్రధానికి తీరికలేకపోతే సభను ఆన్‌లైన్‌లో నడిపించండి. అప్పుడైనా వస్తారేమో చూద్దామని నరేష్ అగర్వాల్ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.
చర్చ ప్రారంభిస్తే ప్రధాని సభకు వస్తారన్న కురియన్ వివరణతో సం తృప్తిచెందని ప్రతిపక్షం, పోడి యం వద్దకు దూసుకొచ్చింది. ఎంఏ ఖాన్, సుబ్బిరామిరెడ్డితోపాటు పలువురు కాంగ్రెస్ సభ్యులు, ఇతర ప్రతిపక్షాల సభ్యులు పోడియం వద్ద ప్రభుత్వానికి వ్యతిరేంగా నినాదాలిచ్చారు. మూడుసార్లు సాధారణ వాయిదాల అనంతరం సభ అదుపులోకి రాకపోవడంతో గురువారానికి వాయిదా పడింది.