జాతీయ వార్తలు

పన్ను.. 50 శాతం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లధన కుబేరులకు కేంద్రం మరో అవకాశం ఇచ్చింది. నిర్దేశిత పరిమాణానికి మించిన రీతిలో ఆయా వ్యక్తుల ఖాతాల్లో జమయ్యే మొత్తానికి లెక్కలు చూపించలేని పక్షంలో కనీస పక్షంగా 50 శాతం పన్ను చెల్లిస్తే చాలన్న ప్రకటన చేసింది. అయతే, బ్లాక్‌మనీని సంబంధిత ఖాతాదారు వినియోగానికి అందకుండా నాలుగేళ్ల పాటు తమ వద్దే ఉంచేసుకోవాలని సంకల్పించింది. ఈ మేరకు ఆదాయ పన్ను చట్టంలో సవరణలు తీసుకొచ్చి బిల్లును పార్లమెంట్‌లో త్వరలోనే ప్రవేశ పెట్టాలని భావిస్తోంది.

న్యూఢిల్లీ, నవంబర్ 25: నల్లధన కుబేరుల నుంచి ఎంత వీలుంటే అంతగా అక్రమ సొత్తును రాబట్టే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. రెండున్నర లక్షల వరకూ ఆదాయం పన్ను ఇబ్బంది లేకుండా డిపాజిట్లు చేసుకోవచ్చునని స్పష్టం చేసిన కేంద్రం.. అందుకు అనుకున్న రీతిలో స్పందన రాకపోవడంతో మరింతగా వెసులుబాటు కల్పించింది. నిర్దేశిత పరిమాణానికి మించిన రీతిలో ఆయా వ్యక్తుల ఖాతాల్లో జమ అయ్యే మొత్తానికి లెక్కలు చూపించలేని పక్షంలో కనీస పక్షంగా ఆ మొత్తంపై 50 శాతం పన్ను విధించాలని భావిస్తోంది. అలాగే ఆ బ్లాక్‌మనీని సంబంధిత ఖాతాదారు వినియోగానికి అందకుండా నాలుగేళ్ల పాటు తమ వద్దే ఉంచేసుకోవాలని సంకల్పించింది. ఈ మేరకు ఆదాయం పన్ను చట్టంలో సవరణలు తీసుకు వస్తూ అందుకు సంబంధించిన బిల్లును పార్లమెంట్‌లో త్వరలోనే ప్రవేశ పెట్టాలని భావిస్తోంది. డిసెంబర్ 30 గడువు ముగిసేలోగా ఇచ్చిన అవకాశాల్ని వినియోగించుకోకుండా నల్లధన వివరాలను వెల్లడించని వారిపై మరింత కఠినంగానే కేంద్రం వ్యవహరించనుంది. అంటే..ఆదాయం పన్ను విభాగం దాడి చేస్తే తప్ప నల్ల ధన వివరాలు వెల్లడించని వారిపై 90శాతం పన్ను, పెనాల్టీ విధించే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. గురువారం రాత్రి కేంద్ర కేబినెట్ ఆమోదించిన ఆదాయం పన్ను చట్ట సవరణల ప్రకారం రెండున్నర లక్షలకు మించి డిపాజిట్లు జరిగే మొత్తాలపై 50శాతం పన్ను విధిస్తారు. సగానికి పైగా అలాంటి డిపాజిట్లు లేదా ఒరిజినల్ డిపాజిట్‌లో 25శాతం మొత్తాన్ని సదరు ఖాతాదారు నాలుగేళ్ల వరకూ వెనక్కి తీసుకునే అవకాశం ఉండదని అధికార వర్గాలు తెలిపాయి. తమంతట తాముగా ఈ మొత్తాన్ని వెల్లడించని వ్యక్తులపై మాత్రం కఠినంగా వ్యవహరించడం తథ్యమని చెబుతున్నారు. 500, 1000 నోట్లను రద్దు చేసిన కేంద్రం వాటిని కొత్త నోట్లతో మార్చుకునేందుకు 50రోజుల పాటు అవకాశం కల్పించింది. ఈ గడువు డిసెంబర్ 30తో ముగుస్తుంది. ఇప్పుడు ఈ మార్పిడి కూడా రద్దు కావడంతో నేరుగానే బ్యాంకుల్లో డిపాజిట్ చేయక తప్పని పరిస్ధితి ఏర్పడింది. నగదు మార్పిడికి 2వేల సీలింగ్ పెట్టిన కేంద్రం డిపాజిట్లును మాత్రం ఎలాంటి పరిమితి లేకుండా స్వీకరిస్తోంది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఉన్న జన్‌ధన్ ఖాతాల్లోకి అనూహ్య రీతిలో కేవలం రెండు వారాల్లోనే 21వేల కోట్లు వచ్చి పడ్డాయి. జీరో బ్యాలెన్స్ ఖాతాలుగా భావించే వీటిలోకి ఇంత పెద్ద మొత్తం వచ్చిందంటే అది నల్లకుబేరుల పనేనని కేంద్రం పసిగట్టింది. రెండున్నర లక్షలు దాటిన మొత్తానికి లెక్క చూపని పక్షంలో 200 శాతం జరిమానా, పన్ను విధిస్తామని ఆదాయం పన్ను విభాగం ప్రకటించడంతో నల్లకుబేరుల్లో దడ ముట్టిందని, అందకుకే ఎవరూ తమంతట తాముగానే నల్లధన వెల్లడికి ముందుకు రావడం లేదన్న సంకేతాలు అందుకున్న కేంద్రం ఈ తాజా మార్పులను ప్రతిపాదించింది. పైగా 200శాతం పెనాల్టీ, పన్ను విధించడమన్నది చట్టబద్ధంగా కూడా చెల్లుబాటు అయ్యే అవకాశం లేకపోవడంతో 50శాతం పన్ను ప్రతిపాదనను తెరపైకి తెచ్చిందని చెబుతున్నారు. ఈ 50రోజుల వ్యవధిలో డిపాజిట్ అయ్యే లెక్కల్లేని మొత్తంపై 50శాతం పన్ను విధించేందుకు వీలుగా ఆదాయం పన్ను చట్టానికి సవరణ తెచ్చినట్టుగా తెలుస్తోంది. పార్లమెంట్ ప్రస్తుత సమావేశ కాలంలోనే దీనికి ఆమోద ముద్ర వేయించుకోవాలనీ కేంద్రం పట్టుదలగా ఉంది. నల్లధనం, అవినీతిని అరికట్టేందుకు పెద్ద నోట్ల రద్దు సరైన చర్యే అయినప్పటికీ బినామీ లావాదేవీల ద్వారా సంపాదించిన సంపద మళ్లీ సమాజంలోకి వస్తే ప్రభుత్వ లక్ష్యమే దెబ్బతింటుందన్న ఉద్దేశంతో అక్రమార్జనను కనీస, గరిష్ఠ పన్నుల ద్వారా వెలుగులోకి తీసుకురావాలని భావిస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.