జాతీయ వార్తలు

జన్‌ధన్‌కు షాక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 30: జన్‌ధన్ ఖాతాలను నల్లకుబేరులు దుర్వినియోగం చేయకుండా కట్టడి చేసే చర్యల్ని రిజర్వ్ బ్యాంక్ చేపట్టింది. ఈ ఖాతాల నుంచి నెలకు పదివేల రూపాయలకు మించి విత్‌డ్రా చేసుకునే అవకాశం లేకుండా నిబంధనలు విధించింది. తమ ఖాతాలకు సంబంధించి పూర్తి వివరాలు నింపిన ఖాతాదారులు నెలకు పదివేలు తీసుకోవచ్చు. కానీ, వివరాలివ్వని ఖాతాదారులు నెలకు 5 వేలకు మించి తీసుకోవడానికి వీలుండదు. అయితే ఆయా వ్యక్తుల అవసరాల ప్రాతిపదికగా ఈ పరిమితుల్ని సడలించే అవకాశం ఉంటుందని కూడా ఆర్‌బిఐ తెలిపింది. కానీ, ఇందుకు సంబంధించి అనేక నిబంధనలు వర్తిస్తాయి. దేశంలో 1000, 500 నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి జన్‌ధన్ ఖాతాల్లోకి ఊహించలేనంతగా డిపాజిట్లు రావడంతో.. ఇది నల్ల కుబేరుల పనేనని పసిగట్టిన సర్కార్ తదుపరి నివారణ చర్యలు చేపట్టింది. 64,252.15 కోట్ల డిపాజిట్లతో నవంబర్ 16నాటికి 25.58కోట్ల జన్‌ధన్ ఖాతాలు తెరుచుకున్నాయి. దేశంలోనే పెద్ద రాష్టమ్రైన ఉత్తరప్రదేశ్‌లో అత్యధిక స్ధాయిలో 3.79కోట్ల ఖాతాలున్నాయి. ఈ ఖాతాల్లో 10,670.62 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. అలాగే 2కోట్ల 44లక్షల ఖాతాలు కలిగిన పశ్చిమ బెంగాల్‌లో 7,826.44 కోట్ల మేర డిపాజిట్లు వచ్చాయి.