జాతీయ వార్తలు

సారీ మేడం..తప్పయింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 30: జమ్మూకాశ్మీర్‌లోని నగ్రోటా సైనిక శిబిరంపై ఉగ్రవాదులు చేసిన దాడిలో మరణించిన ఏడుగురు సైనికులకు నివాళులర్పించ లేదంటూ లోక్‌సభ నుంచి వాకౌట్ చేసిన కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు ఆ తరువాత స్పీకర్ సుమిత్రా మాహాజన్‌కు క్షమాపణలు చెప్పారు. ‘మిమ్మల్ని బాధ పెట్టాలని, విమర్శించాలని మా ఉద్దేశం కాదు. ప్రభుత్వం సరైన సమాచారాన్ని సకాలంలో ఇవ్వలేదు. అందుకే మీరు అమరులైన సైనికులకు నివాళులర్పించలేకపోయారని వ్యాఖ్యానించాం’ అని కాంగ్రెస్ పక్షనేత మల్లిఖార్జున ఖర్గే, టిఎంసి పక్ష నేత సుదీప్ బందోపాధ్యాత జీరో అవర్‌లో స్పీకర్‌కు వివరణ ఇచ్చారు. ప్రభుత్వం సకాలంలో సరైన సమాచారం ఇవ్వనందుకే నగ్రోటా సంఘటనలో మరణించిన సైనికులకు నివాళులు అర్పించలేకపోయారంటూ ప్రతిపక్షం చేసిన వాదనను సుమిత్రా మాహాజన్ ఖండించారు. ప్రభుత్వం సకాలంలో సరైన సమాచారం ఇవ్వనందుకే తాను మరణించిన సైనికులకోసం సంతాప తీర్మానం పెట్టలేదనడం నిజం కాదని ఆమె స్పష్టం చేశారు. ‘ప్రభుత్వం మాకు సమాచారం ఇచ్చింది. నగ్రోటాలో సైనిక చర్య ఇంకా కొనసాగుతోంది. కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతున్నందుకే నేను మరణించిన సైనికులకు నివాళులు అర్పించలేదు’ అని స్పీకర్ స్పష్టం చేశారు. జరిగిన దానికి క్షమాపణ కోరారు.. సంతోషం అని ఆమె అన్నారు. లోక్‌సభ బుధవారం ఉదయం 11 గంటలకు సమావేశం కాగానే సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టారు. అయితే ప్రతిపక్షం గత 13 రోజుల నుంచి చేస్తున్న విధంగానే కార్యక్రమానికి అడ్డుతగులుతూ పెద్ద నోట్ల రద్దు మూలంగా ప్రజలెదుర్కొంటున్న సమస్యలతోపాటు నగ్రోటాలో వీరమరణం పొందిన సైనికుల అంశాన్ని లేవనెత్తారు. కూంబింగ్ జరుగుతున్నందే నగ్రోటాపై ప్రకటన చేయలేదని స్పీకర్ చెబుతున్నా ప్రతిపక్ష కాంగ్రెస్ పట్టించుకోలేదు. స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రతిపక్షం సృష్టించిన గందరగోళంలోనే రెండు ప్రశ్నలను చర్చకు చేపట్టారు. అయితే ప్రతిపక్ష పార్టీల నినాదాలతో సభ దద్దిరిల్లిపోయింది. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. సభ తిరిగి సమావేశం కాగానే మల్లిఖార్జన ఖర్గే లేచి జరిగిన దానికి క్షమాపణ కోరుతున్నట్టు వెల్లడించారు. ‘ప్రభుత్వం మీకు సరైన సమాచారం ఇవ్వనందుకే మరణించిన సైనికులకు నివాళులు అర్పించలేకపోయారు’ అని ఆయన అన్నారు. తృణమూల్ నేత సుదీప్ బంధోపాధ్యాయ కూడా ఇలాంటి వివరణే ఇచ్చారు.