జాతీయ వార్తలు

ఓటింగ్ జరగాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 30: పెద్ద నోట్ల రద్దుతో ప్రజలెదుర్కొంటున్న ఇబ్బందుల గురించి చర్చించేందుకు బుధవారం లోక్‌సభలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య అవగాహన కుదిరినట్లే కుదిరి మళ్లీ మొదటికి వచ్చింది. లోక్‌సభ జీరో అవర్‌లో కాంగ్రెస్ పక్షనేత మల్లిఖార్జున ఖర్గే, తృణమూల్ కాంగ్రెస్ పక్షనేత సుదీప్ బందోపాధ్యాయ మాట్లాడుతూ 56వ నిమయావళి ప్రకారం చర్చ జరిపేందుకు అధికార పక్షం సిద్ధం కాకపోతే మరే ఇతర నియమం కిందనైనా చర్చ జరిపేందుకు తాము సిద్ధమని ప్రకటించారు. ఏ నియమం కింద చర్చ జరిపినా ఆఖరున ఓటింగ్‌కు వీలుండాలని ప్రతిపక్షం సభ్యులు సూచించారు. పెద్దనోట్ల రద్దువల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై 13 రోజుల నుంచి సభను గందరగోళంలో పడవేస్తున్న ప్రతిపక్షం బుధవారం వ్యూహం మార్చి స్పీకర్ తమకు తోచిన నియమం కింద చర్చ జరిపించినా తమకు సమ్మతమేనని ప్రకటించింది. చర్చ జరిగిన అనంతరం ఓటింగ్ జరిగేందుకు వీలుండాలని వారు సూచించారు. సిపిఎం పక్షం సభ్యుడు సలీం, బీజూ జనతా దల్ సీనియర్ నాయకుడు బర్తృహరి మహతాబ్ మాట్లాడుతూ ఏదో ఒక విధంగా చర్చ జరపాలని సూచించారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్ మాట్లాడుతూ పెద్దనోట్ల రద్దుపై చర్చించేందుకు తాము 16 తేదీ నుంచి సిద్ధంగానే ఉన్నామని ప్రకటించారు. చర్చ ఈ క్షణం నుండి ప్రారంభించినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. స్పీకర్ సుమిత్రా మహాజన్ మాట్లాడుతూ ‘56వ నిబంధన కింద చర్చ జరపాలని ప్రతిపక్షం డిమాండ్ చేస్తోంది. అధికార పక్షం 193 నియమం కింద మాత్రమే చర్చ జరిపేందుకు సిద్ధమని చెబుతోంది. ఉభయులూ సభా నియమాల ప్రకారం చర్చ జరిపేందుకు అంగీకరించడం లేదు’ అని అన్నారు. అధికార, ప్రతిపక్షాలు నిబంధనల ప్రకారం చర్చకు అంగీకరించకపోతే ఎలా అని ఆమె సభలోనే ప్రశ్నించారు. ఇరుపక్షాలు సిద్ధంగా ఉంటే చర్చ వెంటనే ప్రారంభిస్తానని స్పీకర్ వెల్లడించారు. దీంతో అనంతకుమార్ లేచి చర్చ ఇప్పుడే ప్రారంభించాలని అన్నారు. ఈ దశలో కాంగ్రెస్, టిఎంసి సభ్యులు జోక్యం చేసుకుని ఓటింగ్‌తో కూడిన చర్చ జరగాలని పట్టుపట్టారు. దీంతో సభలో మరోసారి గందరగోళం నెలకొన్నది. ప్రభుత్వం ఓటింగ్‌తో కూడిన చర్చకు అంగీకరించడం లేదంటూ తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు పోడియం వద్దకు వచ్చి నినాదాలు ఇవ్వటం ప్రారంభించారు. ఇంతలో పలువురు కాంగ్రెస్, వామపక్షాల సభ్యులు కూడా పోడియం వద్దకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇవ్వటంతో సభ దద్దరిల్లిపోయింది. స్పీకర్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. తిరిగి సమావేశమైన తరువాత కూడ ప్రతిపక్షం సభ్యులు పోడియంను చుట్టుముట్టి ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తూ సభా కార్యక్రమాలను పూర్తిగా స్తంభింపజేశారు. లోక్‌సభలో ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఉన్నా ఓటింగ్‌తో కూడిన చర్చకు ఎందుకు అంగీకరించటం లేదంటూ మల్లిఖార్జున ఖర్గే, సుదీప్ బందోపాధ్యాయ నిలదీశారు. సభలో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పటంతో సుమిత్రా మహాజన్ లోక్‌సభను గురువారానికి వాయిదా వేశారు.

బుధవారం లోక్‌సభలో మాట్లాడుతున్న స్పీకర్ సుమిత్రా మహాజన్, ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే

జెఎంఎం నేత
దారుణ హత్య

బార్ అసోసియేషన్ భవనంలోనే కాల్చివేసిన దుండగులు

జంషెడ్పూర్, నవంబర్ 30: జార్ఖండ్‌లోని జంషెడ్పూర్‌లో జెఎంఎం నాయకుడు ఉపేంద్ర సింగ్‌ను బుధవారం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పట్టపగలు అందరూ చూస్తుండగానే దారుణంగా కాల్చి చంపారు. స్థానిక కోర్టు ఆవరణలోని నిత్యం రద్దీగా ఉండే బార్ అసోసియేషన్ భవనం రెండో అంతస్తులో ఈ సంఘటన చోటు చేసుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సింగ్ జంషెడ్పూర్ పశ్చిమ నియోజకవర్గంనుంచి జెఎంఎం టికెట్‌పై పోటీచేసి ఓడిపోయారు. పెండింగ్‌లో ఉన్న ఒక కేసులో బెయిల్‌కు సంబంధించి తన లాయరుతో మాట్లాడడానికి సింగ్ బుధవారం ఉదయం సీతారాండేరా పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న బార్ అసోసియేషన్ భవనానికి వచ్చినప్పుడు దుండగులు ఆయనపై గుళ్లవర్షం కురిపించారు. రక్తపు మడుగులో పడి ఉండిన సింగ్‌ను హుటాహుటిన టాటా మెయిన్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆయన చనిపోయారని డాక్టర్లు చెప్పినట్లు నగర పోలీసు సూపరింటెండెంట్ ప్రశాంత్ ఆనంద్ చెప్పారు. ఈ సంఘటన జరిగిన వెంటనే ఇద్దరిని అరెస్టు చేయడం జరిగిందని, దర్యాప్తు కొనసాగుతోందని ఆయన చెప్పారు. సింగ్‌కు స్థానిక బస్టాండ్‌లో ఓ రెస్టారెంట్ ఉంది. తన వ్యాపార భాగస్వామి రామ్ షకల్ యాదవ్ హత్యకు సంబంధించి గత ఏడాది సింగ్‌ను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. అనంతరం కొద్ది నెలల క్రితమే ఆయన బెయిలుపై విడుదలయ్యారు. ఈ కేసుతోపాటుగా కొనే్నళ్ల క్రితం బస్టాండ్ వద్ద ముగ్గురి ప్రాణాలను బలిగొన్న కాల్పుల సంఘటనసహా మరికొన్ని కేసులు కూడా సింగ్‌పై ఉన్నాయి. కాల్పుల ఘటన తర్వాత లాయర్లు పరుగులు తీశారని, మహిళా న్యాయవాది కిందపడిపోవడంతో గాయపడ్డారని బార్ అసోసియేషన్ వర్గాలు తెలిపాయి. కాల్పులకు పాల్పడ్డ ఇద్దరు వ్యక్తులను జనం పట్టుకొని చితకబాదడంతో వారు సైతం గాయపడ్డారు. అనంతరం ఆ ఇద్దరినీ పోలీసులకు అప్పగించారు. సంఘటన తర్వాత పరిస్థితి చేయి దాటిపోకుండా చూడడానికి పోలీసు ఉన్నతాధికారులు అదనపు బలగాలతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు.

పార్లమెంట్ క్యాంటీన్లలో
నగదు రహిత లావాదేవీలు
న్యూఢిల్లీ, నవంబర్ 30: నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఉద్యమానికి ఇప్పుడు పార్లమెంటు సైతం మద్దతు పలికింది. పార్లమెంటు ఆవరణలోని క్యాంటీన్లు, ఇతర తినుబండారాల దుకాణాల్లో నగదు రహిత పేమెంట్ల సదుపాయాన్ని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ బుధవారం ప్రారంభించారు. ఎంపీలు, మీడియాకోసం ఏర్పాటుచేసిన క్యాంటీన్లు, సెంట్రల్ హాలుసహా పార్లమెంటు ఆవరణలో 18చోట్ల ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. చెల్లింపులు జరపడంలో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఉండడానికి ఈ చర్య తీసుకున్నట్లు పార్లమెంట్ ఫుడ్ కమిటీ చైర్మన్ ఎపి జితేందర్ రెడ్డి పిటిఐకి తెలిపారు. నగదు కొరత కారణంగా పార్లమెంటు క్యాంటీన్లలో చెల్లింపులు జరపడంలో ఇబ్బంది ఎదురవుతోందని, కొన్ని సార్లు బిల్లు చెల్లించడానికి కస్టమర్ల వద్ద నగదు లేకపోవడం, అలాగే మరికొన్ని సందర్భాల్లో క్యాంటీన్ క్యాషియర్ వద్ద చిల్లర లేకపోవడమో జరుగుతోందని, అందువల్ల కార్డుద్వారా పేమెంట్లు జరపడంవల్ల ఈ సమస్య తీరుతుందని లోక్‌సభలో టిఆర్‌ఎస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న జితేందర్ రెడ్డి చెప్పారు. ఇది ఒక ఆప్షన్ మాత్రమేనని చెప్పిన ఆయన రాబోయే రోజుల్లో దీన్ని నగదు రహిత ఏరియాగా చేస్తామని, దీనివల్ల అందరికీ ప్రయోజనం కలుగుతుందని ఆయన చెప్పారు. దీనిపై స్పందన ఎలా ఉందని అడగ్గా, ఎంపీలుసహా పార్లమెంటులో ప్రతి ఒకరూ దీనిపై సంతోషంగా ఉన్నారని ఆయన చెప్పారు.

మింటూకు
ఐఎస్‌తో లింకులు!
పోలీసు ఇంటరాగేషన్‌లో వెల్లడి
న్యూఢిల్లీ, నవంబర్ 30: పంజాబ్‌లో జైలు నుంచి తప్పించుకుపోయి పోలీసులకు పట్టుబడిన ఖలీస్తాన్ లిబరేషన్ ఫోర్స్ చీఫ్ హర్మీందర్ సింగ్ అలియాస్ మింటూ ఇంటరాగేషన్‌లో దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడించాడు. ఐఎస్ సహకారంలో పంజాబ్‌లో తిరిగి ఉగ్రవాద కార్యకలాపాలు ప్రారంభించేందుకు ప్రయత్నిచాడని వెల్లడైంది. పాటియాలలోని నభా జైలు నుంచి తప్పిచుకోవడానికి రెండు రోజులు ముందు ఐఎస్‌తో ఇంటర్నెట్‌లో చాటింగ్ చేసినట్టు బయటపడింది. మింటూ ఇంటరాగేషన్‌లోని వెల్లడించిన అంశాలు ఓ వార్త సంస్థ ఐఎస్‌కు కంబోడియా, లావోస్, మైన్మార్, థాయ్‌లాండ్‌లో స్థావరాలున్నాయని పేర్కొంది. పంజాబ్‌లో తిరిగి విధ్వంసం సృష్టించేందకు ఐఎస్‌తో సంప్రదింపులు జరిపినట్టు మింటూ వెల్లడించాడు. కెఎల్‌ఎఫ్‌కు నిధులు ఎక్కడ నుంచి వచ్చేది హర్మీందర్ తెలిపాడు. జర్మనీ, ఇంగ్లాండ్‌లోని శాండిప్‌ల నుంచి సానుభూతిపరుల విరాళాలు పంపేవారని వెల్లడించాడు.

హవాలా చానల్ ద్వారా తమకు నిధులు అందేవని ఉగ్రవాది మింటూ పేర్కొన్నాడు. నాభా జైలు నుంచి తప్పించుకుపోయిన హర్మీందర్ సింగ్‌ను ఢిల్లీ నిజాముద్దీన్ రైల్వేస్టేషన్‌లో పట్టుకున్నారు. మింటూను కోర్టులో హాజరుపరచగా డిసెంబర్ 5 వరకూ కస్టడీకి తరలించారు. ఒక పిస్తోల్, క్యార్టిరిజ్ మింటూ నుంచి స్వాధీనం చేసుకున్నారు. తొలుత బబ్బర్ ఖల్సా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ సభ్యుడైన హర్మీందర్ సింగ్ ఖలీస్తాన్ లిబరేషన్ ఫోర్స్ పేరుతో సొంత గ్రూపును ఏర్పాటుచేసుకున్నాడు.