జాతీయ వార్తలు

ఆజంఖాన్ క్షమాపణకు సుప్రీం తిరస్కృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 7: ‘గ్యాంగ్ రేప్ సంఘటన రాజకీయ కుట్ర’ అంటూ తాను చేసిన వ్యాఖ్యపై ఉత్తరప్రదేశ్ మంత్రి, సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజంఖాన్ చెప్పిన క్షమాపణను సుప్రీంకోర్టు బుధవారం తిరస్కరించింది. ఆజంఖాన్ చెప్పింది బేషరతు క్షమాపణ కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. తన వివాదాస్పద వ్యాఖ్యలపై బులంద్‌షహర్ గ్యాంగ్ రేప్ బాధితులకు బేషరతుగా క్షమాపణ చెబుతున్నానని నవంబర్ 17న ఆజంఖాన్ సుప్రీంకోర్టుకు తెలిపారు. బాధితుల (ఒక మహిళ, ఆమె కుమార్తె)ను బాధపెట్టడం తన ఉద్దేశం కాదని, ఒకవేళ వారు బాధపడినా, అవమానం జరిగినట్లు భావించినా అందుకు తాను బేషరతుగా క్షమాపణ చెబుతానని, ఈ విషయమై తాను అఫిడవిట్ సమర్పిస్తానని ఆజంఖాన్ న్యాయమూర్తులు దీపక్ మిశ్రా, అమితవ్ రాయ్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనానికి తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లా దోస్త్‌పూర్ గ్రామ సమీపంలో జూలై 29న అర్ధ రాత్రి 34 ఏళ్ల మహిళ, టీనేజర్ అయిన ఆమె కుమార్తెపై అయిదారుగురు గుర్తు తెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. నోయిడా నుంచి జాతీయ రహదారి 91 మీదుగా ఆరుగురు కుటుంబ సభ్యులతో వెళ్తున్న కారును దుండగులు అడ్డుకొని ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. కాగా, ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు ధర్మాసనం డిసెంబర్ 15వ తేదీకి వాయిదా వేసింది.